Train Driver Viral Video: బాబోయ్.. రాత్రివేళ మంచులో రైలు స్పీడ్‌గా వెళ్తుంటే వీడియో చూశారా? ఎలాన్ మస్క్ ఎంట్రీతో వైరల్ ..
ఈ వీడియో రైలు డ్రైవర్ వ్యూవ్ నుంచి భయకరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.

Viral Video
Train Driver Viral Video: రైలు కూతపెట్టుకుంటూ పట్టాలపై దూసుకెళ్తుంటే ఎలా ఉంటుంది..! దగ్గరగా ఉండి ఆ వేగాన్ని చూడాలంటే మన రెండు కళ్లు సరిపోవు. అదే తరహాలో రాత్రివేళ మంచులో వేగంగా వెళ్తున్న రైలును డ్రైవర్ ప్లేస్‌లో కూర్చొని వీక్షిస్తే.. బాబోయ్..! ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రివేళ వేగంగా వెళ్తున్న రైలులో డ్రైవర్ సీటు నుంచి ముందుభాగం వీక్షిస్తే ఎలా ఉంటుందో చూపుతూ ‘వావ్ టెరిఫైయింగ్’ అనే ట్విటర్ ఖాతాదారు వీడియోను పోస్టు చేశారు.
Viral Video: స్వేచ్ఛా ప్రపంచంలోకి మూగజీవాలు.. ఈ వీడియో చూశారా.. చూస్తే వావ్ అనాల్సిందే!
ఈ వీడియో రైలు డ్రైవర్ వ్యూవ్ నుంచి భయకరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. వీరిలో బిలియనీర్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఒకరిలా చేరిపోయాడు. ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడంతో వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. దీంతో 2.2 మిలియన్ల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. కొందరు నెటిజన్లు తమదైన శైలిలో రీట్వీట్లు చేస్తున్నారు.
Train drivers view at night. pic.twitter.com/axBkW6PXzg
— Wow Terrifying (@WowTerrifying) March 7, 2023
ఓ నెటిజన్ స్పందిస్తూ.. బహుశా నేను భారీ మంచు మధ్య హైస్పీడ్ రైలు డ్రైవర్ వీక్షణను కొనుగొనగలను అని ట్వీట్ చేశాడు. అందరూ ఒకే సమయంలో అందంగా, భయానకంగా ఉన్నారు అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. ‘ఇది చాలా భయకరంగా ఉంది’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా పలువురు నెటిజన్లు తమదైన శైలిలో ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.