Un-Islamic: ఫిఫా వరల్డ్ కప్‭పై ముస్లిం సంఘాల వ్యతిరేకత.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ నిరసనలు

మొత్తం ఫుట్‭బాల్ ఆటనే వాళ్లు వ్యతిరేకించడం లేదు కానీ, సాకర్ ప్రపంచ కప్‭పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కారణం, అందులో పోర్చుగల్ ఉండడం. ఇంతకీ పోర్చుగల్‭పై ఎందుకా వ్యతిరేకత అంటే, ఇస్లాం దేశాలను ఆక్రమించుకుని బానిసలుగా చేశారని వారి వాదన. సాకర్ సందర్భంగా ఫుట్‌బాల్ సెలబ్రిటీల కటౌట్లు కేరళ రాష్ట్రంలో విరివిగా వెలిశాయి

Un-Islamic: ఫిఫా వరల్డ్ కప్‭పై ముస్లిం సంఘాల వ్యతిరేకత.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ నిరసనలు

Muslim Body Calls FIFA World Cup Is Un-Islamic

Un-Islamic: ప్రపంచ వ్యాప్తంత అత్యంత క్రేజ్ ఉన్న ఆట ఫుట్‭బాల్. మన దేశంలో దీని ప్రాధాన్యత కాస్త తక్కువే ఉంటుంది. కానీ యూరప్, అమెరికా దేశాల్లో ఈ ఆటకు ఉండే అభిమానం, ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇక ఫిఫా వరల్డ్ కప్‭ అంటే, ప్రపంచం మొత్తం ఫుట్‭బాల్ మేనియాలోకి వెళ్లిపోతుంది. ప్రాంతం, మతం, జెండర్‭లతో సంబంధం లేకుండా క్రీఢాభిమానులంతా ఫుట్‭బాల్ మత్తులో మునిగి తేలుతారు. అలాంటి ఈ ఆటపై కొన్ని ముస్లిం సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లాంకు వ్యతిరేకమంటూ మండిపడుతున్నాయి.

PSLV C-54: పీఎస్‌ఎల్‌వీ-సీ54 ప్రయోగం సక్సెస్.. తొమ్మిది ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్

అయితే మొత్తం ఫుట్‭బాల్ ఆటనే వాళ్లు వ్యతిరేకించడం లేదు కానీ, సాకర్ ప్రపంచ కప్‭పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కారణం, అందులో పోర్చుగల్ ఉండడం. ఇంతకీ పోర్చుగల్‭పై ఎందుకా వ్యతిరేకత అంటే, ఇస్లాం దేశాలను ఆక్రమించుకుని బానిసలుగా చేశారని వారి వాదన. సాకర్ సందర్భంగా ఫుట్‌బాల్ సెలబ్రిటీల కటౌట్లు కేరళ రాష్ట్రంలో విరివిగా వెలిశాయి. అయితే దీన్ని ఇస్లాంకు వ్యతిరేకమంటూ రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు శనివారం నిరసన వ్యక్తం చేశాయి. సమస్త కేరళ జాం-ఇయ్యతుల్ ఉలామా సంఘం జనరల్ సెక్రెటరీ నాసర్ ఫియాజీ కూడతయి మాట్లాడుతూ ‘‘సాకర్ ఆట వల్ల చాలా మంది చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ ఆటగాడు నేమర్ లాంటి భారీ కటౌట్లు వెలిశాయి. దీని వల్ల విద్యార్థులు తమ చదువులపై ఆసక్తి చూపలేకపోతున్నారు. ఎంత సేపు ఆట మోజులోనే ఉంటున్నారు’’ అని అన్నారు.

Gujarat Election 2022: ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు.. బీజేపీ గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘పోర్చుగల్ జెండాలు ఎగురవేయడం సరికాదు. చాలా దేశాలను ఆక్రమించి బానిసలుగా మార్చిన దేశం అది. అలాగే ఇతర దేశాల జెండాలను ఎగరవేయడం మన భారతీయులకు తగదు. మన జాతీయ జెండా ఉంది. దానిపైనే మనకు గౌరవం ఉండాలి’’ అని అన్నారు. ఇక ఆట గురించి మాట్లాడుతూ ‘‘క్రీడాస్ఫూర్తితోనే ఆటల్ని చూడాలి. అయితే ఫుట్‌బాల్ అనేది క్రీడాస్ఫూర్తిని దాటిపోయి అడిక్ట్‭గా మారింది. ఇది సరి కాదు’’ అని అన్నారు.

Elon Musk : ఆపిల్, గూగుల్ ఒకవేళ ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తే.. ఏం చేస్తాడో చెప్పేసిన ఎలన్ మస్క్.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!