ముస్లిం ఫ్యామిలీ ఔన్నత్యం : కూతురి వెడ్డింగ్ కార్డుపై సీతారాముల ఫొటో

మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా ఓ ముస్లిం ఫ్యామిలీ తమ గొప్పతనాన్ని చాటుకుంది. తమ కూతురి పెళ్లి శుభలేఖపై హిందువుల ఆరాథ్య దైవమైన స్వామి సీతారాముల ఫొటోను ఫ్రింట్ చేయించారు.

  • Published By: sreehari ,Published On : April 25, 2019 / 10:16 AM IST
ముస్లిం ఫ్యామిలీ ఔన్నత్యం : కూతురి వెడ్డింగ్ కార్డుపై సీతారాముల ఫొటో

మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా ఓ ముస్లిం ఫ్యామిలీ తమ గొప్పతనాన్ని చాటుకుంది. తమ కూతురి పెళ్లి శుభలేఖపై హిందువుల ఆరాథ్య దైవమైన స్వామి సీతారాముల ఫొటోను ఫ్రింట్ చేయించారు.

మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా ఓ ముస్లిం ఫ్యామిలీ తమ గొప్పతనాన్ని చాటుకుంది. తమ కూతురి పెళ్లి శుభలేఖపై హిందువుల ఆరాథ్య దైవమైన స్వామి సీతారాముల ఫొటోను ఫ్రింట్ చేయించారు. ఉత్తర ప్రదేశ్ లోని చైలువా గ్రామానికి చెందిన ముస్లీం కుటుంబం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

తమ కూతురు రుక్షార్ విహహం సందర్భంగా అతిథులకు ఇచ్చే వెడ్డింగ్ కార్డులపై లార్డ్ రామ, సీత దేవుళ్లు ఫొటోను అచ్చు వేయించారు. పెళ్లి శుభలేఖపై ఫ్రింట్ చేయించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తమ గ్రామంలో ముస్లిం, హిందువులు కలిసిమెలిసి నివసిస్తున్నారని, కులమతాలకు అతీతంగా సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు పెళ్లికూతురి తల్లి బేబీ చెప్పింది. మతపరంగా తాము వేరుగా ఉండటం ఇష్టం లేదని, అందరితో కలిసి ఉండాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొంది.

రుక్షర్ సోదరుడు మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. గ్రామస్థులంతా తమ వెడ్డింగ్ కార్డును చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రజల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నాడు.