మైనర్ ముస్లిం బాలిక ఇష్టం మేరకు పెళ్లి చేసుకోవచ్చు

మైనర్ ముస్లిం బాలిక ఇష్టం మేరకు పెళ్లి చేసుకోవచ్చు

Muslim law allows minor girls to marry : మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకొనే హక్కు ఉందని పంజాబ్ – హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇది ఇస్లామిక్ చట్టం ప్రకారం ఉందని, ఆర్టికల్ 195 ఉదహరించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం జంట హైకోర్టును ఆశ్రయించింది. 37 సంవత్సరాలున్న ఓ వ్యక్తి…17 ఏళ్ల అమ్మాయి..2021 జనవరి 21వ తేదీన పెళ్లి చేసుక్కున్నారు.

పెళ్లి ఇష్టం లేని కుటుంబసభ్యులు తమను వేధిస్తున్నారని..రక్షణ కల్పించాలంటూ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. పదిహేను సంవత్సరాలు దాటి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే అది తమ ఇష్టం. ఇందులో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కోర్టు చెప్పింది.

జస్టిస్ అల్కా సరిన్ తీర్పును వెలువరించారు. యుక్త వయస్సు మైనర్లు మాత్రం తమ ఇష్టం మేరకు గార్డియన్ అనుమతి ఉన్నా..లేకపోయినా..పెళ్లి చేసుకోవచ్చని వెల్లడించారు. అమ్మాయి మైనర్ అయినా..ఇస్లామిక్ చట్టం ప్రకారం..ఈ పెళ్లి చెల్లుతుందని కోర్టు తీర్పును వెలువరించింది. వెంటనే వాళ్లకు రక్షణ కల్పించాలని SSP Mohali (SAS Nagar)ని ఆదేశించింది.