High Court : భార్యా బిడ్డల్ని పోషించలేని ముస్లింకు రెండో వివాహం చేసుకునే హక్కు లేదు

భార్యా బిడ్డల్ని పోషించలేని ముస్లిం వ్యక్తి రెండో వివాహం చేసుకునే హక్కు లేదు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

High Court : భార్యా బిడ్డల్ని పోషించలేని ముస్లింకు రెండో వివాహం చేసుకునే హక్కు లేదు

Allahabad High Court

Allahabad High Court : ముస్లిం సామాజికం వర్గంలో భార్యను వదిలించుకోవటానికి తలాఖ్ అని మూడు సార్లు చెప్పి వదలించుకుని మరో వివాహం చేసుకుంటుంటారు. ఇది చట్టపరంగా నేరమే అయినా ముస్లిం సామాజిక వర్గాల్లో జరుగుతుంటుంది. ఈక్రమంలో ఓ కేసు విషయంలో విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ముస్లిం వ్యక్తి రెండో వివాహం విషయంలో కీలక తీర్పునిచ్చింది. మొదటి భార్య, ఆమెకు పుట్టిన సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో వివాహం చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లామిక్​ చట్టం ప్రకారం ముస్లింలకు మొదటి భార్య ఉండగానే.. రెండో పెళ్లి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు వెల్లడించింది.

మొదటి భార్య అనుమతి లేకుండా భర్త.. రెండో పెళ్లి చేసుకోవడం.. మొదటి భార్యపై కక్ష తీర్చుకోవడమే అవుతుందని వ్యాఖ్యానించింది. భార్యకు ఇష్టం లేకుండా తనతో కలిసి ఉండమని కోర్టు ద్వారా కోరే హక్కు వారికి లేదని…అలాచేస్తే అది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని అజీజుర్‌ రెహమాన్‌ అనే వ్యక్తి అప్పీలును తోసిపుచ్చుతూ జస్టిస్‌ ఎస్​పీ కేశర్వణి, జస్టిస్‌ రాజేంద్రకుమార్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ఈ తీర్పు వెలువరించింది.

కేసు వివరాలు ఇలా..
అజీజుర్ రెహమాన్, హమీదున్నిషా 12 మే 1999న వివాహం చేసుకున్నారు. హమీదున్నిషా తన 93 ఏళ్ల తండ్రిని, ముగ్గురు పిల్లలనూ చూసుకుంటూ ఇంట్లో ఉంటోంది. ఆమెకు తెలియకుండా భర్త రెహమాన్​.. రెండో వివాహం చేసుకున్నాడు. తనతో కలిసి ఉండాలని మొదటి భార్యను కోరుతూ ఫ్యామిలో కోర్టులో పిటిషన్ వేశాడు. దాన్ని కోర్టు నిరాకరించింది. ఖురాన్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక ముస్లిం తన భార్య, పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతే.. అతను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అనుమతించబోమని సంత్ కబీర్‌నగర్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది.

భార్యను తనతో ఉండమనే హక్కు రెహమాన్​కు లేదని తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన రెహమాన్ ను కోర్టు కీలక వ్యాఖ్యలతో ఝలక్ ఇచ్చింది. మొదటి భార్య హమీదున్నీషా అలియాస్ షఫీకున్నీషాకు ఇష్టం లేకుండా.. తన భర్తతో కలిసి ఉండాలని కోరేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఫిటిషన్​ను కొట్టివేసింది.