లింగాయత్ మఠం హెడ్ గా ముస్లిం

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2020 / 01:04 PM IST
లింగాయత్ మఠం హెడ్ గా ముస్లిం

భిన్నత్వంలో ఏకత్వం అనే పదం భారతదేశానికి సరిపోయినంతగా మరేదేశానికి సరిపోదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ లో ఉండే అన్ని మతాల,కులాల ప్రజలు కలిసి,మెలిసి జీవనం సాగిస్తుంటారు.  ఈ కల్చర్ ని చూసి చాలా దేశాలు భారత్ గ్రేట్ అంటూ మెచ్చుకుంటాయి. అయితే ఇప్పుడు కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన భారత్ అంటే ఇదేరా అని చెప్పే మరో చక్కటి ఉదాహరణగా నిలిచింది.

ఉత్తర కర్ణాటకలోని ఓ లింగాయత్ మఠానికి హెడ్(అధిపతి)గా ముస్లిం మతానికి చెందిన దివాన్ షరీఫ్ ముల్లా ఎన్నుకోబడ్డాడు. గదగ్ జిల్లాలోని రౌన్ తాలూకాకు చెందిన  ఫరీఫ్ ముల్లా…12వ శతాబ్దంలో లింగాయత ధర్మం స్థాపించిన బసవేశ్వరుడి బోధనలను గౌరవించే కుటుంబం నుంచి వచ్చాడు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడింది.

గదగ్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు హెచ్ కే పాటిల్ మాట్లాడుతూ ….గదగ్ లో ఏదైనా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని జాతర కమిటీకి హెడ్ గా నిమయించే సంప్రదాయం మఠానికి ఉన్నట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా బసవుడు బోధించిన తత్వాలపై నమ్మకం ఉన్న ముస్లింలు జాతర కమిటీ చైర్మన్ గా ఎన్నుకోబడినట్లు,ఇదేమీ పెద్ద ఆశ్చర్యపోయే విషయమేమీ కాదని,ఇది ఆరోగ్యకరమైన విధానం అని పాటిల్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నచిత్రదుర్గ లోని  శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర మఠానికి చెందిన 361మఠాలలో గదగ్ లింగాయత్ మఠం ఒకటి. ఈ గదగ్ లింగాయత్ మఠానికి ఇప్పుడు హెడ్ గా నియమితులైన దివాన్ షరీఫ్ ముల్లా కుటుంబం రెండు ఎకరాల భూమిని దానంగా ఇచ్చింది. లింగాయత్ లీడర్ల బోధనల పట్ల ఫరీఫ్ కుటుంబం ఆశక్తి చూపింది. లింగాయత ధర్మాన్ని ఆచరించేవాళ్లు ఫరీఫ్ కుటుంబసభ్యులు.

అందరూ తనను సపోర్ట్ చేశారని,తన నియామకం పట్ల ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని,బసవ బోధనలను మరితంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని ఫరీఫ్ ముల్లా తెలిపారు. ఏ మాతానికి చెందిన వాడినన్నది విషయం కాదని, మంచి,త్యాగంమార్గం కోసం దేవుడు నీకు కనిపించి చెబితే…. పుట్టుక,మతం అనే మనిషి సృష్టించిన పుట్టుక,మతం ఆంక్షలను పట్టించుకోకుండా దేవుడు చూపిన మార్గంలో మనం నడవాలని శ్రీ మురుగరాజేంద్ర కోరనేశ్వర స్వామి తెలిపారు.

బసవేశ్వరుడి బోధనలు

మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.
ఆహారం, ఇల్లు,బట్ట, జ్ఞానం, వైద్యం ఇవి మానవుని కనీస హక్కులు
శివుడే సత్యం, నిత్యం. శివుడు కి రూపం లేదు.
శివుడి పేరిట పురాణాలు అసత్యం.
విగ్రహారాధన ను వ్యతిరేకించారు.
దేహమే దేవాలయం.
వాస్తు,జ్యోతిష్యం అసత్యాలు
స్త్రీ పురుష భేదంలేదు.
శ్రమను మించిన సౌందర్యంలేదు.
భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.
దేవుడికి ప్రజలకు మద్య పూజారులు అవసరం లేదు.
వేదాలు,పురాణాల తిరష్కరణ
యజ్ఞ యాగాలు, పూజలు మూఢనమ్మకాలు
స్వర్గ నరకాలు అబధ్ధం