కన్యాదానం చేసిన ముస్లిం..హిందూ మతానికి చెందిన అక్కా, చెల్లెలి పెళ్లి

  • Published By: madhu ,Published On : August 26, 2020 / 08:59 AM IST
కన్యాదానం చేసిన ముస్లిం..హిందూ మతానికి చెందిన అక్కా, చెల్లెలి పెళ్లి

హిందూ మతానికి చెందిన అక్కా, చెల్లెల్లి పెళ్లిళ్లు చేసిన పఠాన్ మామను అందరూ అభినందిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియో తెగ చక్కర్లు కొడుతోంది. లక్షలాది హృదయాలు గెలచుకున్న పఠాన్ మామను హాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు. మతసామరస్యానికి మారుపేరు భారతదేశం అని మరోసారి నిరూపితమైంది.



మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు చెందిన బాబా భయ్ పఠాన్ తన సొంత ఖర్చుతో హిందూ మతానికి చెందిన వివాహాలను హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిపించాడు.
https://10tv.in/lover-kiss-the-bride-in-front-of-the-groom-karimnagar/
అహ్మద్ నగర్ లో సవిత అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె భర్తను కోల్పోయింది. ఏదో పని చేసుకుంటూ..ఇద్దరు కూతుళ్ల (గౌరీ, సౌరీ)లను పెంచి పెద్ద చేసింది. మగ దిక్కు లేని ఈ కుటుంబానికి పఠాన్ పెద్ద దిక్కుగా మారాడు. మతాలన్నీ ఒక్కటే అని నిరూపించాడు.



ప్రతి సంవత్సరం సవిత చేత రాఖీ కట్టించుకొనే వాడు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొనేవాడు. కూతుళ్లకు సవిత వివాహం చేసింది. మేనమామ హోదాలో గౌరీ, సౌరీలకు కన్యాదానం చేశాడు.

సొంత ఖర్చుతో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించాడు. అత్తారింటికి సాగనంపుతున్నప్పుడు…మేనమామను పట్టుకుని..గౌరీ, సౌరీ కన్నీళ్ళు పెట్టుకున్నారు. వారిని గట్టిగా పట్టుకుని పఠాన్ ఓదార్చాడు.



ఈ ఫొటో ఎంతోమంది నెటజన్ల హృదయాలను గెలుచుకుంది. నువ్వు నిజంగా సూపర్ మామ..అంటూ ప్రశంసలు, అభినందిస్తున్నారు. ట్రూ ఇండియన్ అంటూ..ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.