వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 06:34 AM IST
వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి

అబ్దుల్లాపూర్ : జాతీయ గీతం వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణతంత్ర దినోత్సవం (ఫిబ్రవరి 26)న జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వందేమాతరం పాటను పాడేందుకు ఇష్డపడని ఓ ముస్లిం టీచర్ పై స్థానికులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బీహార్ లోని కతియార్ జిల్లాలో చోటుచేసుకోగా… దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్జల్ హుస్సేన్ అనే టీచర్ అబ్దుల్లాపూర్ ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంటారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఈ ఘటన అఫ్జల్ స్పందించారు. 
 

వందేమాతరం పాడటం తన మతానికి విరుద్ధమని… అందుకే ఆ పాడలేదనీ..వందేమాతరంలో ‘వందన’ అంటే భారతమాత అని… దాన్ని ముస్లింలు నమ్మరనీ..అందుకే పాడలేదని స్పష్టం చేశారు. అయినా భారత రాజ్యాంగంలో వందేమాతరం తప్పనిసరిగా పాడాల్సిందేనని ఎక్కడైనా ఉందా? అంటు  ప్రశ్నించాడు. దీనిపై  డీఈవో దినేష్ చంద్ర దేవ్ మాట్లాడుతూ..తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని..ఫిర్యాదు వస్తే విచారణ జరుపుతామని తెలిపారు.