ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉంది : ముస్లిం పర్సనల్‌ లా బోర్డు

ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది.

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 01:52 AM IST
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉంది : ముస్లిం పర్సనల్‌ లా బోర్డు

ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది.

ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది. మత సిద్ధాంతాలు, విశ్వాసాలను అనుసరించి మసీదుల్లోకి ప్రవేశించే అనుమతి మహిళలకు ఉందని, ఈ హక్కును వినియోగించుకోవడం వారి ఇష్టమని తెలిపారు. 

ఈ మేరకు బోర్డు కార్యదర్శి మహమ్మద్ ఫజ్లుర్రహీం అఫిడవిట్ లో పేర్కొన్నారు. సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనల్లో మహిళలు పాల్గొనడం తప్పనిసరి కాదని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పష్టం చేసింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించే విషయమై జోక్యం చేసుకోవాలంటూ యస్మీన్ జుబెర్ అహ్మద్ పీర్జాదీ వేసిన పిటిషన్ విచారణలో ముస్లిం లా బోర్డు సమాధానం ఇచ్చింది.

మసీదుల్లోకి మహిళల ప్రవేశం కోరుతూ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ముస్లిం పర్సనల్‌ లా బోర్డును ఆదేశించింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వివరణ తెలుపుతూ.. బుధవారం (జనవరి 29, 2020) సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.