మసీదులో హిందూ వివాహం జరిపిన ముస్లింలు

మసీదులో హిందూ వివాహం జరిపిన ముస్లింలు

మతాలకు అతీతంగా జరిగిన ఈ పెళ్లి ఆ జిల్లాకే కాదు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. కేరళలోని అలప్పుఝా ప్రాంతంలోని మసీదులో ఇద్దరు హిందూ మతస్థులు ముస్లిం వ్యక్తుల ఏర్పాట్లతో జరిగిన వివాహంతో ఒకటయ్యారు. వేదికగానే కాదు.. మహిళ తరపు ఆర్థికంగానూ సాయం చేసింది ఆ మసీదు.

అంజూ, శరత్ శశి అనే ఇద్దరు జనవరి 19న చేరువళ్లీ ముస్లిం జమాత్ మసీదులో ఉదయం 11గంటల 30నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల మధ్యలో పెళ్లి చేసుకున్నారు. మరో విశేషమేమిటంటే 1000మంది వ్యక్తులకు వెజిటేరియన్ ఫుడ్ అందజేశారు ముస్లిం సోదరులు. 

పెళ్లికూతురికి బంగారంతో పాటు.. రూ.2లక్షల నగదు కూడా అందజేశారు. అశోకన్ అనే వ్యక్తి 2018లో మరణించాడు. అతని భార్య అయిన బిందు మసీదు దగ్గరి ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. తన కూతురి వివాహానికి సాయం చేయాలని మసీదు యాజమాన్యాన్ని కోరింది. అడిగిన వెంటనే కాదనకుండా సాయం చేయడంతో ఆ కుటుంబం కృతజ్ఞత వ్యక్తం చేసింది.