ముస్లింలపై సీఎం వ్యాఖ్యలు: మీరు వెళ్లటానికి 150 దేశాలున్నాయ్..హిందువులకు ఇండియా ఒక్కటే

ముస్లింలపై సీఎం వ్యాఖ్యలు: మీరు వెళ్లటానికి 150 దేశాలున్నాయ్..హిందువులకు ఇండియా ఒక్కటే

పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో మద్ధతు కోసం ఓ కార్యక్రమం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘ముస్లింకు 150దేశాలు ఉన్నాయి. కానీ, హిందువుల కోసం ఉంది భారతదేశం ఒక్కటే’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇదే క్రమంలో బీజేపీ గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 62ర్యాలీలు నిర్వహించింది. అహ్మదాబాద్‌లో ర్యాలీకి రూపాణీ అధ్యక్షత వహించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఆధ్వర్యంలో మెహసానాలోనూ CAAర్యాలీలు జరిగాయి. ఈ సందర్భంగానే రూపాణీ.. ముస్లింలు భారతేదేశంలో సంతోషంగా ఉన్నారు. వారి జనాభా 9నుంచి 14శాతానికి పెరిగింది. రాజ్యాంగం కల్పిస్తున్న భద్రత కారణంగా వారు హుందాతనమైన జీవితం గడుపుతున్నారు. 

ఇంకా మాట్లాడుతూ.. పాకిస్తాన్ లో హిందువుల శాతం 22నుంచి 3శాతానికి పడిపోయింది. అక్కడ వేధనకు, అత్యాచారాలకు గురయ్యారు. ఆస్తులు నాశనం అయ్యాయి. చాలా ఏళ్ల క్రితమే భారత్‌కు తరిమేశారు. వారికి ఏ రకమైన బెనిఫిట్ లు పొందలేకపోతున్నారు. దానికి కారణం వారు భారతీయులు కావడమే. బంగ్లాదేశ్ లో 2శాతం హిందువుల జనాభా మాత్రమే ఉంది. అఫ్ఘనిస్తాన్‌లో 2లక్షల జనాభాకు హిందువులు, సిక్కులు కలిపి 500 లేదా అంతకంటే తక్కువ మంది మాత్రమే ఉన్నారు. 

ముస్లింలకు 150దేశాలు ఉన్నాయి. కానీ, హిందువులు ఉండటానికి ఉంది కేవలం భారత్ మాత్రమే. కాంగ్రెస్, మిత్రపక్షాలు కలిసి దేశంలో శాంతి లేకుండా చేస్తున్నాయి. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దేశం విడిపోయినప్పుడు మహాత్మాగాంధీ చెప్పిందేంటి. ఈ మూడు దేశాల నుంచి హిందువులు రావడానికి సిద్ధమైనప్పుడు సీఏఏ దేనికి వ్యతిరేకం అవుతుంది’ అని ప్రశ్నించారు.