హిందూ కల్చర్ వల్లనే : భారత్ లోని ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : October 13, 2019 / 06:57 AM IST
హిందూ కల్చర్ వల్లనే : భారత్ లోని ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారు

భారతదేశంలో ముస్లింలు చాలా బతుకుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యావత్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న ముస్లింలు కనబడేది ఇండియాలో మాత్రమేనని అన్నారు. ఇందుకు కారణం మనమంతా హిందువులు కావడమేనని ఆయన తెలిపారు.
 
ఒడిషా రాజధాని భవనేశ్వర్ లో శనివారం(అక్టోబర్-12,2019)జరిగిన ఓ మీటింగ్ లో మోహన్ భగవత్ మాట్లాడుతూ…అత్యంత సంతోషంగా బతుకుతున్న ముస్లింలు భారతదేశంలోనే కనిపిస్తారని, వారు అంత సంతోషంగా ఉండటానికి హిందూ సంస్కృతే కారణమని అన్నారు. హిందూ అనేది ఒక మతమో, భాషో కాదని, ఇండియాలో ఎవరైతే నివసిస్తున్నారో వారందరి సంస్కృతి అని అన్నారు. 

వివిధ విశ్వాసాలకు చెందిన ముస్లింలు కావచ్చు, పార్సీలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారంతా ఎంతో భద్రతాభావంతో ఉన్నారంటే ఈ ఏకత్వమే కారణమని తెలిపారు. యూదులకు ఆశ్రయమిచ్చిన ఏకైక దేశం భారత్ అని గుర్తుచేశారు. పార్శీల ప్రార్థనలు, వారి మతం ఇండియాలో మాత్రమే సురక్షితంగా ఉందని అన్నారు. ఇండియాలోని వైవిధ్యాన్ని ప్రస్తావిస్తూ…సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు వైరైనప్పటికీ తామంతా ఒక్కటేననే భావనే భారతీయులందరిలో ఉందని అన్నారు.