Mumbai: శివాజీ, అంబేద్కర్లను అవమానించారంటూ మహా వికాస్ అగాడీ ‘హల్లా బోల్’ ర్యాలీ
ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం ఇదే రోజున ర్యాలీ చేపట్టింది. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. దీనిపై ముంబైలోని నారిమన్ పాయింట్, ఘట్కోపర్, కండివాలి, అంధేరి, దాదార్ ప్రాంతాల్లో నిరసన చేపట్టనుంది.

MVA’s ‘Halla Bol Morcha’ to clash with BJP’s ‘Maafi Mango Andolan’
Mumbai: మహా వికాస్ అగాడీ నేతృత్వంలో ముంబైలో శనివారం మహా ర్యాలీ జరగనుంది. బైకుల్లా నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ వరకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్) పార్టీలు కలిసి ‘హల్లా బోల్’ పేరుతో ఈ ర్యాలి నిర్వహించనున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌పై రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చేసి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. డిసెంబర్ 19న మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగపూర్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ఈ ర్యాలీ చేపట్టినట్లు విమర్శకులు అంటున్నారు.
శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం మొదటిసారి ఈ మూడు పార్టీలు కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నాయి. ఈ ఏడాది జూలైలోనే మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ ర్యాలీకి ముంబై పోలీసుల నుంచి మొదట అనుమతి రానప్పటికీ శుక్రవారం అనుమతి ఇచ్చారు. అయితే ర్యాలీ శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలని నిర్వాహకులకు ముంబై పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని, ఆయుధాలు, లాఠీలు, దిష్టిబొమ్మలు తీసుకెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఇక ఎంవీఏ నిర్ణయించిన రూట్ మ్యాప్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని ముంబై పోలీసులు స్పష్టం చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మినహా ఎంవీఏ సహా ఇతర చిన్న పార్టీలకు చెందిన సీనియర్ నాయకులందరూ 2.2 కి.మీ దూరం నడవనున్నారు. ‘‘ఆరోగ్య సమస్యల కారణంగా, పవార్ ఎక్కువ దూరం నడవడం సాధ్యం కాదు. సభా ప్రాంగణానికి మాత్రం ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడానికి వస్తారు” అని ఎన్‌సిపి సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. మోర్చాలో పాల్గొనాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని పవార్ స్వయంగా కరద్‌లో ఇటీవల చెప్పారు.
Supreme Court: అందుకేగా మేమున్నది.. వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం ఇదే రోజున ర్యాలీ చేపట్టింది. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. దీనిపై ముంబైలోని నారిమన్ పాయింట్, ఘట్కోపర్, కండివాలి, అంధేరి, దాదార్ ప్రాంతాల్లో నిరసన చేపట్టనుంది.