Arvind Kejriwal : నేను చేసిన నేరం అదే..ఆక్సిజన్ రిపోర్ట్ వివాదంపై కేజ్రీవాల్ ఘాటు రిప్లై

కోవిడ్ రెండో దశ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం.. అవసరమైన ఆక్సిజన్‌ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్‌ చేసిందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్‌ ప్యానెల్‌ మధ్యంతర రిపోర్ట్ లో తేల్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

Arvind Kejriwal : నేను చేసిన నేరం అదే..ఆక్సిజన్ రిపోర్ట్ వివాదంపై కేజ్రీవాల్ ఘాటు రిప్లై

Kejriwal

Arvind Kejriwal కోవిడ్ రెండో దశ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం.. అవసరమైన ఆక్సిజన్‌ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్‌ చేసిందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్‌ ప్యానెల్‌ మధ్యంతర రిపోర్ట్ లో తేల్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..కోవిడ్ పీక్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మరియు ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాను రాజకీయం చేశాయని చూడటం నమ్మశక్యం కాదు. ఇవి దిగజారుడు రాజకీయాలు. రిపోర్ట్ లో ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సమర్పించిన డేటా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కేజ్రీవాల్ అబద్దాల కారణంగా 12 రాష్ట్రాలు ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నాయి. కేజ్రీవాల్ అబద్దాల కారణంగా ఆక్సిజన్ ట్యాంకర్లు రోడ్లపై నిలిచిపోయాయి. ఈ ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాల్లో వినియోగించబడినట్లయితే చాలా మంది ప్రాణాలు కాపాడబడి ఉండేవి. కేజ్రీవాల్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు అని సంబిత్ పాత్ర ఆరోపించారు.

కేజ్రీవాల్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్ 100శాతం అడ్వర్టైజింగ్ మరియు 0 శాతం కోవిడ్ మేనేజ్ మెంట్ అనే ఫార్ములాతో పనిచేస్తున్నారని సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగించనదానికి కేజ్రీవాల్ బాధ్యత వహించాలని మరో బీజేపీ నేత పియూష్ గోయల్ డిమాండ్ చేశారు.

అయితే బీజేపీ చెప్తున్నట్లు ఏ రిపోర్ట్ లేదని.. ఇదంతా ద్వేషపూరిత మరియు అసత్య ప్రచారమంలో భాగమని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఇక.. తనపై,ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ చేస్తోన్న ఆరోపణలను ఖండించిన సీఎం కేజ్రీవాల్.. తాను ఏ నేరానికి పాల్పడలేదన్నారు. బీజేపీ విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు కేజ్రీవాల్. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోరాడటమే నేను చేసిన నేరం. వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలను ప్రస్తావిస్తూ..మీరు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నప్పుడు ఆక్సిజన్ ఏర్పాటు చేయడం కోసం నేను రాత్రంత్రా మేల్కొన్నాను. ప్రజలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసేందుకు నేను పోరాడాను మరియు బ్రతిమాలాడాను. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. దయచేసి వారిని అబద్దాలకోరులని పిలువవద్దు అని హిందీలో చేసిన ట్వీట్ లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.