Mizoram CM : మా మంత్రులకు హిందీ రాదు..సీఎస్ ను మార్చాలని అమిత్ షాకు సీఎం లేఖ

మిజోరంలో అధికార ఎన్డీయేలో సంఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చాలని ఎన్డీయే భాగస్వామి "మిజో నేషనల్​ ఫ్రంట్​" అధ్యక్షుడు

Mizoram CM : మా మంత్రులకు హిందీ రాదు..సీఎస్ ను మార్చాలని అమిత్ షాకు సీఎం లేఖ

Mizo

Mizoram CM: మిజోరంలో అధికార ఎన్డీయేలో సంఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చాలని ఎన్​డీఏ భాగస్వామి “మిజో నేషనల్​ ఫ్రంట్​” అధ్యక్షుడు, సీఎం పూ జోరంతంగ స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కు లేఖ రాయడం సంచలనంగా మారింది.

మిజోరం క్యాబినెట్‌లో ఉన్నచాలామంది మంత్రుల‌కు హిందీ భాష రాదని,కొంద‌రికి ఇంగ్లీష్ భాష‌తోనూ స‌మ‌స్య ఉంద‌ని,ఇటువంటి పరిస్థితుల్లో మీజో భాష తెలియ‌ని వ్య‌క్తి చీఫ్ సెక్ర‌ట‌రీతో ప‌నిచేయ‌డం ఇబ్బందిగా మారుతుంద‌ని సీఎం త‌న లేఖ‌లో తెలిపారు. కాబట్టి వెంటనే సీఎస్ రేణూ శ‌ర్మ‌ను మార్చాల‌ని లేఖ‌లో అమిత్ షాను సీఎం కోరారు. ప్రస్తుత అదనపు ముఖ్య కార్యదర్శి జేసీ రామ్​థంగాకు పదోన్నతి కల్పించి.. సీఎస్​గా నియమించాలని ప్రతిపాదించారు.

మిజోరం సీఎస్​గా రేణు శర్మను కేంద్రం గత నెలలో నియమించింది. అయితే మిజో భాష తెలియని ఆమె ఎప్పటికీ సమర్థమైన సీఎస్ కాలేరని, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్థానిక భాష తెలియని వారిని కేంద్రం ఎప్పుడూ నియమించలేదని సీఎం అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి నుంచి తాను ఎన్డీయేకు నమ్మకస్తుడిగా ఉన్నానని.. అందుకే నా విజ్ఞప్తిని పరిశీలిస్తుందని అనుకుంటున్నా అని సీఎం తెలిపారు. ఒకవేళ తన ప్రతిపాదనను కేంద్రం తిరస్కరిస్తే.. ఎన్డీయేకు విశ్వాసపాత్రంగా పనిచేస్తున్నందుకు కాంగ్రెస్​ సహా ఇతర పార్టీలు తనను ఎగతాళి చేస్తాయని చెప్పారు. కాబట్టి త‌న అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించి, సీఎస్‌ను మార్చాల‌ని సీఎం కోరారు.

ALSO READ New Rafale Report : రాహుల్..దీనికి సమాధానం చెప్పాల్సిందే,రాఫెల్ రగడ మళ్లీ స్టార్ట్