Teachers Leave Letters viral : టీచర్ల వింత లీవ్ లెటర్లు..! మ్యాటర్ చూసిన ఉన్నతాధికులకు దిమ్మ తిరిగిపోయింది..!!

హార్ టీచర్ల వింత లీవ్ లెటర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లీవ్ అప్లికేషన్ లో లెటర్లలో టీచర్లు చెప్పిన విషయాలు చూస్తే దిమ్మ తిరిగిపోయింది ఉన్నతాధికారులకు. ఏదో ఆకతాయి పిల్లలు లీవ్ కోసం టీచర్లను అడిగినట్లుగా ఉన్నాయి ఈ లెటర్లలో సారాంశం..మా అమ్మ త్వరలో చనిపోతుంది..త్వరలో నాకు ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి సెలవు కావాలి అంటూ వింత వింతకారాణాలతో అప్లికేషన్ లెటర్ లో పేర్కొన్నారు గవర్నమెంట్ టీచర్లు.

Teachers Leave Letters viral : టీచర్ల వింత లీవ్ లెటర్లు..! మ్యాటర్ చూసిన ఉన్నతాధికులకు దిమ్మ తిరిగిపోయింది..!!

Bihar  Teachers Leave Letters viral : బీహార్ లో గవర్నమెంట్ టీచర్ల వింత లీవ్ లెటర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లీవ్ అప్లికేషన్ లో లెటర్లలో టీచర్లు చెప్పిన విషయాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది.ఏదో ఆకతాయి పిల్లలు లీవ్ కోసం టీచర్లను అడిగినట్లుగా ఉన్నాయి ఈ లెటర్లలో సారాంశం. ఓ టీచర్ ‘నాకు త్వరలోనే నా ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి నాలుగైదు రోజులు సెలవురు కావాలి’ అని లెటర్ లో పేర్కొంటే..మరో టీచర్ నాకు త్వరలో కడుపు నొప్పి వస్తుంది కాబట్టి లీవ్ కావాలి‘ అని కోరగా..మరో టీచర్ మరో మరీ దారుణంగా ‘డిసెంబర్ (12,2022) 5 తేదీ రాత్రి 8 గంటలకు మా అమ్మగారు చనిపోతారు కాబట్టి నాకు లీవ్ కావాలి’ అంటూ కోరారు. ఇలా పిచ్చి పిచ్చి కారణాలతో బీహార్ లో టీచర్లు రాసిన ఈ లీవ్ అప్లికేషన్ లెటర్లు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకా కొంతమంది టీచర్లు రాసిన కారణాలు ఇలా ఉన్నాయి..!

Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

ఈ లెటర్ల సారాంశం చూస్తే ఎవ్వరికైనా అవో పిచ్చి కారణాలని ఇట్టే తెలిసిపోతుంది. పిల్లలు సెలవుల కోసం తెలిసీ తెలియని తనంతో ఇలా రాసి ఉన్నారని కూడా అనిపిస్తుంది. కానీ లెటర్లు రాసినవారు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్లే కావవటం విశేషం…ఈ వింత లీవ్‌ లెటర్ల విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.

Read more : viral letter : మా ఊరికి రోడ్డు వేయిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా..ప్రధానితో పాటు CMకు యువతి లెటర్

వీళ్లసలు బాధ్యతగల టీచర్లేనే..మరీ ఇంత దారుణమైన అబద్దాలా? అని ఆశ్చర్యపోతున్నారు. మరికొంతమంది అయితే సెలవు చీటీలు ఇలా కూడా రాస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. బీహార్‌లో… సెలవు పెట్టడానికి మూడు రోజులు ముందే దరఖాస్తు చేసుకోవాలని లేకుంటా లీవ్ ఇవ్వటం కుదరదు అంటూ భాగల్‌పూర్ కమిషనర్ దయానిధన్ పాండే ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వింత లీవ్ లెటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావటం విశేషం.

Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

తన తల్లి చనిపోబోతోందని బాంకా జిల్లా కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే టీచర్ 2022 డిసెంబర్ 5 సోమవారం రాత్రి 8 గంటలకు నా తల్లి చనిపోతుంది కాబట్టి నాకు అంత్యక్రియలు చేయటానికి డిసెంబర్ 6 నుంచి సెలవు కావాలని కోరాడు.బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్‌గౌరవ్.. తనకు త్వరలో ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి సెలవు కావాలని లీవ్ అప్లై చేసుకున్నాడు. కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ తాను పెళ్లికి వెళ్తున్నానని.. అక్కడ బాగా తింటాను కాబట్టి కడుపు నొప్పి వస్తుందని..బాధతో స్కూలుకు రాలేను కాబట్టి సెలవు ఇవ్వాలని అప్లై చేసుకున్నాడు. ఈ లీవ్ లెటర్లను చూసి ఉన్నతాధికారులు విస్తుపోవటం వారి వంతైంది.

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

ఈ వింత లెటర్ల గురించి ఉపాధ్యాయ సంఘాలు స్పందిస్తూ..అప్పటి కప్పుడు లీవ్ ఇవ్వటం కుదరదు..లీవ్ కావాలంటే ముందుగానే అప్లికేషన్ పెట్టుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని..కానీ ఏ సమయానికి ఎవరికి ఎటువంటి కష్టం వస్తుందో..ఎటువంటి అవసరం వస్తుందో మూడు రోజులు ముందుగానే ఎలా అనుకుంటాం అందుకే ఇలా వింత లెటర్లతో టీచర్లు తమ నిరసనలు వ్యక్తంచేశారు టీచర్లు అంటూ చెప్పుకొచ్చారు.

Viral Resign Letter : మహిళా ఉద్యోగి వెరైటీ రిజైన్ లెటర్..బాస్ కి దిమ్మ తిరిగిపోయిందిగా..

Read more : viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…