ప్రజల కోరికకు చిహ్నాలు నా విగ్రహాలు… మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి...ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలు,తన పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు.

ప్రజల కోరికకు చిహ్నాలు నా విగ్రహాలు… మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి…ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలు,తన పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి…ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలు,తన పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు. ఈ మేరకు మాయావతి సుప్రీంకోర్టులో మంగళవారం(ఏప్రిల్-2,2019) అఫిడవిట్‌ ఫైల్ చేశారు.ప్రజల అభీష్టం మేరకే ఆ విగ్రహాలు కట్టించానని తెలిపారు.

మాయావతి యూపీ సీఎంగా ఉన్న సమయంలో లక్నో, నోయిడా,మరికొన్ని నగరాల్లో ఆమె విగ్రహాలు, బీఎస్పీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మయావతి తన విగ్రహాలు కట్టించుకున్నారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది సుప్రీంలో పిటిషన్‌ ఫైల్ చేశారు. పార్టీ ప్రచారం కోసం మాయా ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నారని పిటిషన్‌లో తెలిపారు.
Read Also : పారిపోలేదు : నేను ఇంట్లోనే ఉన్నానని మోహన్ బాబు క్లారిటీ

ఈ పిటిషన్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.ప్రజాధనాన్ని ఉపయోగించి మాయావతి తన విగ్రహాలు, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు గాను ఆమె డబ్బు డిపాజిట్‌ చేయాల్సిందేనని, అయితే ఇది తాత్కాలిక అభిప్రాయం మాత్రమేనని, దీనిపై సమగ్రంగా వాదనలు వినాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఈ కేసును ఏప్రిల్-2కు వాయిదా వేస్తున్నామని అని ధర్మాసనం ఆ సమయంలో తీర్పు వెల్లడించింది. దీంతో ఈ కేసులో ఇవాళ సుప్రీంలో మాయా త‌న అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేశారు.సంఘ సంస్కర్తల ఆదర్శాలు, విలువలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను కట్టించాను.బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ప్రచారం కోసం కాదు. రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లను కొట్టివేయాలి’ అఫిడవిట్‌ లో మాయా తెలిపారు.
Read Also : చంద్రగిరిలో చంద్రబాబు : జగన్ మోటా రౌడీ చెవిరెడ్డి చోటా రౌడీ