మా గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

  • Published By: nagamani ,Published On : June 26, 2020 / 10:58 AM IST
మా గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

‘మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు..నాకు సెలవు కావాలి సార్..అలాగే నా ఇంట్లో ఓ గేదె కూడా ఉంది..ఆ గేదె అంటే నాకు చాలా ఇష్టం..దాని పాలు అంటే అంటే ఇంకా ఇష్టం..దాని బాగోలు చూసుకునేవారు ఇంట్లో ఎవ్వరూ లేరు సార్..కాబట్టి దయచేసి నాకు సెలవు ఇప్పించండి సార్’’అంటూ ఓ పోలీసు ఉన్నతాధికారులకు వినూత్నంగా సెలవు కావాలని కోరుతూ వినతిపత్రం సమర్పించుకున్నాడు.

కరోనా కష్టకాలంలో ఓవర్ డ్యూటీలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న పోలీసులు సెలవుల కోసం అధికారులను కోరుతున్నారు. అయినా సెలవులు మంజూరు చేయటంలేదు. దీంతో మధ్యప్రదేశ్‌  రేవాలోని ప్రత్యేక ఆర్మీ దళంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఇలా కొత్తరకంగా అధికారులకు సెలవు లేఖ రాశాడు. 

‘నా తల్లి గారు గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా ఇంటి వద్ద ఓ గేదె కూడా ఉన్నది. అదంటే నాకు ఎంతో ఇష్టం. నేను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో విజయం సాధించేందుకు దాని పాలు కూడా ఒక కారణం. గేదె పాలు చాలా ఆరోగ్యం. ఇటీవల మా గేదె ఓ దూడకు జన్మనిచ్చింది. దానికి సేవలు చేయాలి..దాని దూడను దగ్గరుండి చూసుకోవాలని మాకు ఇంతకాలం పాలు ఇస్తూ మా ఆరోగ్యానికి కారణమైన మా గేదె రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నాకు ఆరు రోజులు సెలవు మంజూరు చేస్తే నా తల్లికి చికిత్స చేయించడంతోపాటు గేదె బాగోగులను కూడా చూసుకుంటాను’ అని అందులో లేఖ పేర్కొన్నాడు కానిస్టేబుల్. 

 కాగా పోలీస్‌ కానిస్టేబుల్‌ రాసిన ఈ సెలవు లేఖ చాలా పాపులర్‌ అయ్యింది. మరోవైపు కారణం ఏదైనప్పటికీ సెలవు కోరిన వారికి తప్పకుండా ఇస్తానని  ఆ పోలీస్‌ కానిస్టేబుల్‌ పై అధికారి పేర్కొన్నారు. ఆ లెటర్ చూసి నాకు నవ్వు వచ్చిందని అన్నారు.

Read: పెంపుడు కుక్కకు కీళ్లనొప్పులు: మెట్లు ఎక్కి దిగటానికి..యజమాని ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే..