Covid Self-Testing Kit: కొవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ మరో మూడ్రోజుల్లో ఫార్మసీల్లోకి..

Covid Self-Testing Kit: కొవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ మరో మూడ్రోజుల్లో ఫార్మసీల్లోకి..

Covie Self

Covid Self-Testing Kit: మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ డెవలప్ చేసిన కొవిడ్-19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ కొవీసెల్ఫ్‌ను మరో రెండు మూడ్రోజుల్లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా ఆన్ లైన్ కొనుగోళ్ల కోసం ఫ్లిప్ కార్టులోనూ అమ్మేందుకు సిద్ధమయ్యామని కంపెనీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ధర రూ.250గా ఉండగా ప్రభుత్వం గుర్తించిన అన్నీ మెడికల్ దుకాణాల్లో దొరకనుంది.

ఈ ప్రత్యేకమైన టెస్టు కిట్ ను దేశంలోని పిన్ కోడ్ ఉన్న 95శాతం ప్రాంతాలకు అందజేయాలనుకుంటున్నాం. ఫార్మసీల్లో, డ్రగ్ స్టోర్లతో పాటు ఫ్లిప్ కార్టులో ఆన్ లైన్ లోనూ కొనుగోలు చేయవచ్చు. వారానాకి కొవీసెల్ఫ్ కిట్లు దాదాపు 7లక్షల వరకూ రెడీ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది.

సెల్ఫ్ టెస్టింగ్ జరగడం వల్ల కరోనావైరస్ వ్యాప్తి తగ్గుతుందనుకుంటున్నాం. దేశం నలుమూలల ఈ కిట్ చేరాలని ప్లాన్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా చేరితేనే టెస్టింగ్ సమస్యలు ఎదుర్కొంటున్న వారికీ అందగలదని మైలాబ్ మేనేజింగ్ డైరక్టర్ హస్ముఖ్ రావల్ అన్నారు.

పూణెకు చెందిన మైలాబ్ డిస్కరవీ సొల్యూషన్ గతనెలలోనే కొవీసెల్ఫ్ ను ఇండియన్ మెడికల్ రీసెచర్ అప్రూవల్ దక్కించుకుని లాంచ్ చేసింది. ఈ టెస్టు రెండు నిమిషాల్లో పూర్తయిపోతుంది. 15నిమిషాల్లో ఫలితం తెలిసిపోతుంది.

ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే.. ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకుని కన్ఫామ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. మ్యాన్యువల్ చూసుకుని ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవచ్చని మైలాబ్ డైరక్టర్ సుజిత్ జైన్ అన్నారు.