గుడ్ న్యూస్ చెప్పిన మైలాన్…ఈ నెలలోనే కరోనా మందు విడుదల

  • Published By: venkaiahnaidu ,Published On : July 6, 2020 / 07:10 PM IST
గుడ్ న్యూస్ చెప్పిన మైలాన్…ఈ నెలలోనే కరోనా మందు విడుదల

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్‌ వెర్షన్‌ ఔషధాన్ని ఈ నెలలోనే విడుదల చేయనున్నామని సోమవారం ప్రకటించింది. కాగా, ఇప్పటికే దేశీయ డ్రగ్ మేకర్స్ సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వెర్షన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నెలలోనే రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్‌ వెర్షన్‌ ఔషధాన్ని ‘డెస్రెం’ పేరుతో భారత్ లో విడుదల చేయనున్నట్లు మైలాన్ తెలిపింది. ‘డెస్రెం’ పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కు చెందిన గిలియడ్ సైన్సెస్ కు చెందిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమెడిసివిర్ జనరిక్‌ వెర్షన్‌ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు 4,800 రూపాయలు (64 డాలర్లు) చొప్పున విడుదల చేస్తామని మైలాన్‌ ప్రకటించింది.

కాగా, సిప్లాకు చెందిన సిప్రెమిని 5,000 రూపాయల కన్నా తక్కువ ధరకే అందివ్వనుండగా, హెటెరో కోవిఫోర్ ఔషధం ధరను 5,400 రూపాయలకు నిర్ణయించింది.

మరోవైపు, కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో మూడవ స్థానంలో భారత్ నిలిచింది. దేశంలో అదుపు 7లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 20వేలకు చేరింది.