హోదాను సైతం పక్కనపెట్టి, కారు టైర్ బిగించిన కలెక్టర్

హోదాను సైతం పక్కనపెట్టి, కారు టైర్ బిగించిన కలెక్టర్

mysore district collector: ఆవిడో కలెక్టర్… చిన్న సమస్య వచ్చినా క్షణాల వ్యవధిలో చక్కబెట్టేందుకు సిబ్బంది రెడీగా ఉంటారు. అంతేగాదు..సమాజంలో గొప్ప హోదా ఉంటుంది. ఎలాంటి సదుపాయాలు కావాలన్న క్షణాల్లో అందుబాటులోకి తెస్తుంటారు. అయితే..కలెక్టర్ హోదాను సైతం పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకున్నారు మైసూర్‌ కలెక్టర్‌ రోహిణి సింధూరి. తన కుటుంబసభ్యులతో కలిసి వారం రోజుల క్రితం పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారు డ్రైవ్‌ చేశారు. అయితే మార్గమాధ్యలో టైర్‌ పంక్చర్‌ అయ్యింది.

దీంతో స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్‌.. కారు కింద జాకీ అమర్చి టైర్‌ను ఊడదీశారు. మరో టైర్‌ను అమర్చారు. అటుగా వెళ్తున్న కొందరూ దీనిని గమనించారు. మీరు మైసూరు జిల్లా కలెక్టర్ కదా..అని అడగ్గా..అవును..తానే రోహిని సింధూరినని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. కలెక్టర్‌గా ఉండి స్వయంగా కారు టైర్‌ మార్చడంతో రోహిణిపై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.