భారీగా పెరిగిన మలప్పురం జనాభా…కారణం ఇదేనంట

  • Published By: venkaiahnaidu ,Published On : January 9, 2020 / 10:11 AM IST
భారీగా పెరిగిన మలప్పురం జనాభా…కారణం ఇదేనంట

మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్లం, పప్పులు, కొబ్బరి, అరటి, కర్రపెడెలం, రబ్బరు ప్లాంటేషన్ ఉన్నాయి. మలప్పురం ముస్లిం ప్రజలు అధికంగా ఉన్న జిల్లాలలో ఒకటి. జిల్లాలో హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు మరియు ఇతర మతస్థులు ఉన్నారు.

అయితే ఉత్తర కేరళలోని మలప్పురం…ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) రూపొందించిన చార్ట్ ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో మూడు భారతీయ నగరాలు మొదటి పది స్థానాల్లో ఉంటే..అవన్నీ కేరళలో ఉండటం విశేషం. 2015-2020 మధ్యకాలంలో మలప్పురం జనాభా 44శాతం పెరిగింది. గ్లోబల్ చార్ట్ లో..35శాతం జనాభా పెరుగుదలతో కోజికోడ్ నాల్గవ స్థానంలో ఉండగా, 31శాతం జనాభా పెరుగుదలతో కొల్లం పదవ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అందించిన డేటాపై EIU ఈ జాబితాను రూపొందించింది. మొత్తం మీద ఆరు భారతీయ నగరాలు టాప్ 30 లిస్ట్ లో ఉన్నాయి.

మలప్పురాన్ని ప్రత్యేకంగా ఉంచేది ఏమిటి?

కేరళ రాష్ట్రం…అధిక అక్షరాస్యత,స్థాయి సంతానోత్పత్తి రేటుతో పాటు ఇతర సామాజిక-ఆర్థిక సూచికలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. మలప్పురం,కోజికోడ్,కొల్లం జిల్లాల్లోని అక్షరాస్యత రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది. మంచి కుటుంబాలు సాధారణంగా తక్కువ మంది పిల్లలను కలిగి ఉంటాయి. కొంతమంది విశ్లేషకులు…మలప్పురం నగరంలోని అధిక సంఖ్యలోని ముస్లింలలో క్రమరాహిత్యం ఉందని భావించవచ్చు. వీరు ఇతరులకన్నా పెద్ద కుటుంబాలను కలిగి ఉంటారు. అయితే భారతదేశం అంతటా ఒక కుటుంబం యొక్క పరిమాణం మత విశ్వాసంతో పోలిస్తే కుటుంబ ఆదాయంతో చాలా బలమైన సంబంధం కలిగి ఉంటుంది. వీటన్నిటిలో,పట్టించుకోని అంశం.. గ్రామీణ నివాసితులు నగరాలకు వెళ్ళే ట్రెండ్. చాలా రాష్ట్రాల్లో ఇదే పట్టణ జనాభా పెరగడానికి కారణమవుతోంది. ఎక్కువ నివాసయోగ్యంగా కనిపించే నగరాలు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తాయి. నివాసయోగ్యంగా ఉన్న నగరాలకు గ్రామీణప్రాంతాల ప్రజలు వలస వెళ్తున్న ట్రెండ్ పెరుగుతోంది. మలప్పురం నివాసయోగ్యానికి అనుగువుగా ఉండటంతొో చాలామంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మలప్పురం సిటీలో నివసించేందుకు ఇష్టపడతున్నట్లు తెలుస్తోంది. ఇదే మలప్పురం జనాభా పెరుగులకు కారణం అయి ఉండవచ్చని తెలుస్తోంది.