Bengaluru : బెంగళూరులో భారీ శబ్దాలు..భూకంపం వచ్చిందా ?

భారీ శబ్ధం వినిపించిందని, ఈ శబ్ధాలకు ఇంటి తలుపులు, కిటికీలు ఊగిపోయాయంటూ...అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Bengaluru : బెంగళూరులో భారీ శబ్దాలు..భూకంపం వచ్చిందా ?

Bengaluru

Mystery Sound : బెంగళూరు నగరంలో భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా శబ్దాలు రావడంతో భూకంపం వచ్చిందా అని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల వచ్చిన శబ్దాలా ? లేక మరేదైనా జరిగిందా అని చర్చించుకుంటున్నారు. ఈ ఘటన 2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఈ శబ్దాలు వినిపించాయి. దీనికి సంబంధించిన విషయాలను పలువురు నెట్టింట పోస్టులు చేయడంతో వైరల్ గా మారాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరలో భారీ శబ్దం వినిపించిందని, ఈ శబ్దాలకు ఇంటి తలుపులు, కిటికీలు ఊగిపోయాయంటూ…అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Read More : Can’t quash Rape case : అత్యాచారం చేసి..ఆమెనే పెళ్లి చేసుకుంటే నేరం చేయనట్లా?కేసు విచారణ జరుపుతాం: హైకోర్ట్

దీనిపై ప్రకృతి విపత్తుల విభాగం స్పందించింది. శబ్దాలకు..భూ ప్రకంపనలకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో శబ్దాలు వచ్చినట్లు తమకు సమాచారం వచ్చిందని, వీటిపై తాము అధ్యయనం చేయడం జరిగిందని కర్నాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం తెలిపింది. ఎలాంటి భూకంప సంకేతాలు కనిపించలేదని స్పష్టం చేయడంతో బెంగళూరు నగర వాసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే..అసలు సౌండ్స్ ఎందుకు వచ్చాయనే దానిపై క్లారిటీ రావడం లేదు. గతంలో కూడా ఇలాంటి శబ్దాలు వినిపించాయని పలువురు వెల్లడిస్తున్నారు.