N-95 Mask లో బంగారం Smuggling

  • Published By: madhu ,Published On : October 2, 2020 / 01:13 PM IST
N-95 Mask లో బంగారం Smuggling

Kerala N-95 Mask : అక్రమంగా బంగారం తరలించడంలో స్మగ్లర్లు ఆరితేరుతున్నారు. అయితే..పోలీసుల తనిఖీల్లో వారి ఆటలు సాగడం లేదు. తాజాగా ఓ దొంగ..మాస్క్ లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.



ఈ రాష్ట్రంలో సాధారణంగా కాలికట్, తిరువనంతపురం విమానాశ్రయం వివిధ మార్గాల ద్వారా..బంగారాన్ని తరలిస్తుంటారు. ఇటీవలే సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న ఒక వ్యక్తి వద్ద రూ. 30 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.



తాజాగా..సెప్టెంబర్ 28వ తేదీన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kozhikode Airport) లో కేరళ నుంచి దుబాయ్ కు వెళ్లేందుకు విమానం రెడీగా ఉంది. కోవిడ్ నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అక్కడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ ప్యాసింజర్ నోటికి N -95 Mask పెట్టుకుని వచ్చాడు. ఎందుకో అనుమానం వచ్చింది.



ఆ మాస్క్ ను సునిశితంగా పరిశీలించారు. అందులో 40 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.