Covid 19 : ఎన్ని రోజులకు N-95 Mask మార్చాలి

వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా బయటకు వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

Covid 19 : ఎన్ని రోజులకు N-95 Mask మార్చాలి

N 95

Washable And Reusable : కరోనా టైం నడుస్తోంది. దీని నుంచి బయటపడాలని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ..చాలా మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్నారు. ఎంతో మందికి పాజిటివ్ రికార్డులు నమోదవుతున్నాయి. వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా బయటకు వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే..మాస్క్ ల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో కొన్ని సందేహాలున్నాయి. ఏ మాస్క్ ధరించాలి ? ధరిస్తే..రెండు మాస్క్ లు ధరిస్తే..బెటరా ? అని ఇలా ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. మాస్క్ ల్లో N-95 Mask కీలకం. దీనిని ఉతకొచ్చా ? ఎన్ని రోజులకు ఛేంజ్ చేయాలని అడుగుతుంటారు.

ఎవరు వాడాలి :-

డాక్ట‌ర్లు, న‌ర్సులు, వైద్య సిబ్బంది, అలాగే క‌రోనా బారిన ప‌డిన వారిని చూసుకునే వారు ఈ N95 మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రిగా వాడాలి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా వీటిని ధ‌రించాలి. మిగిలిన వారు మూడు పొర‌ల‌తో కూడిన స‌ర్జిక‌ల్ మాస్కులు ధ‌రిస్తే చాలు.

ఎలాంటివి వాడాలి :-
రెస్పిరేట‌రీ వాల్వ్ లేని ఎన్ 95 మాస్కుల‌ను మాత్ర‌మే వాడాలి. ఎందుకంటే..ఈ వాల్వ్ లు..వాతావ‌ర‌ణంలో ఉండే గాలిని శుద్ధి చేసి అందిస్తాయి. ఇక్కడ మ‌నం వ‌దిలిన గాలిని నేరుగా బ‌య‌ట‌కు పంపిచేస్తుంది. ఒక‌వేళ క‌రోనా సోకిన వారు రెస్పిరేట‌రీ వాల్వ్ ఉన్న‌ ఎన్‌-95 మాస్కులు ధ‌రిస్తే వారు వ‌దిలిన గాలి నేరుగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఇంకేముంది..ఇతరులకు వైరస్ సోకుతుంది.

ఉతకవచ్చా ? :-
N-95 Maskలు క‌రోనా వైర‌స్‌ను 95 శాతం వ‌ర‌కు స‌మ‌ర్థంగా అడ్డుకుంటాయంటుంటారు. వీటి ధ‌ర కొంచెం ఎక్కువ‌గానే ఉంటుందనే సంగతి తెలిసిందే. వీటిని ఉతికి వాడుకోవ‌డం చేయొద్దని, వీటిని ఉత‌క‌డం వ‌ల్ల వ‌డ‌పోత సామ‌ర్థ్యం దెబ్బ‌తింటుందని నిపుణులు సూచిస్తున్నారు. N95 మాస్క్‌ల‌ను కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల్లో మాత్ర‌మే శుభ్రం చేస్తారు.

ఎన్నిసార్లు మార్చాలి :- 
ఎన్ 95 మాస్కుల‌ను ప్ర‌తి 8 గంట‌ల‌కు ఒక‌సారి మార్చాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఒక మాస్క్ ను మరోసారి వాడాలని అనుకుంటే…నాలుగు మాస్క్ లు తీసుకోవాలి. ఫస్ట్ డే వాడిన మాస్క్ ను కవర్ లో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. రెండో రోజు ఇంకో మాస్క్ వాడి దాన్ని వేరే క‌వ‌ర్‌లో భ‌ద్ర‌ప‌ర‌చుకోవాలి. ఇలా నాలుగు మాస్కుల‌ను నాలుగు రోజులు వాడి..కవర్ లో భద్రపరుచుకోవాలి. ఐదో రోజు మొద‌టి రోజు వాడిన మాస్క్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ మాస్క్ మీద వైర‌స్‌తో కూడిన తుంప‌ర్లు ఏవైనా చేరి ఉంటే ఆ నాలుగు రోజుల్లో ఎండిపోతాయి. ఇలా ఒక్కో మాస్క్‌ను నాలుగు నుంచి ఐదు సార్లు వాడుకోవచ్చు.

Read More : కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పొడిగింపుపై స్పందించిన సీరం సీఈవో