ఇక కుక్క మాంసం తినం..అమ్మం.. అక్కడి గవర్నమెంట్ నిర్ణయం

  • Published By: nagamani ,Published On : July 6, 2020 / 05:16 PM IST
ఇక కుక్క మాంసం తినం..అమ్మం.. అక్కడి గవర్నమెంట్ నిర్ణయం

ఇకపై మేము కుక్క మాంసం తినం..కుక్క మాంసం వ్యాపారాలు చేయం అంటూ నాగాలాండ్ ప్రభుత్వం చెబుతోంది. కరోనా కాలంలో కుక్క మాంసాలు తినవద్దని ఎంతమంది ఎన్నివిధాలుగా చెప్పినా వినని నాగాలాండ్ ప్రభుత్వం దారికి వచ్చింది. ఇకపై కుక్కమాంసం అస్సలు తినమని చెబుతోంది. నాగాలాండ్‌కి కుక్క మాంసం దిగుమతి, వ్యాపారం, అమ్మకం ఇకపై ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి టెంజెన్ టాయ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

నాగాలాండ్‌లో కుక్కలు,కుక్కల మాంసాన్ని విక్రయించడానికి వ్యతిరేకంగా ఇటీవల ఆన్‌లైన్ ప్రచారం విపరీతంగా జరిగింది. వీటిలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా),ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ జంతు సంరక్షణ సంస్థ (FIAPO)కూడా ఉంది.కాగా..నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక దేశంలోని కుక్కలు బతికిపోయినట్టే అని జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా..కుక్క మాంసంపై నిషేధం విధించటంతో నాగాలాండ్‌లోని ఓ వర్గం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

కుక్కల్ని తినడం తరాలుగా సంప్రదాయంగా వస్తోందనీ.. తమ ఆచారాల్ని మంట కలిపే కుట్ర జరుగుతోందని వాదిస్తున్నారు..ఇది ముమ్మాటికి కావాలని చేసే కుట్రేనని వారు ఆరోపిస్తున్నారు.కాగా..నాగాలాండ్‌ ప్రభుత్వం సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం కూడా ఉంది. నాగాలాండ్‌లోని ఓ వెట్ మార్కెట్లో సంచుల్లో కుక్కల్ని తాళ్లతో కట్టి అమ్మకానికి పెట్టారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చైనాలో ఇలాంటి వెట్ మార్కెట్ కారణంగానే కరోనా పుట్టిందని..అటువంటి కుక్కల మార్కెట్ నాగాలాండ్ లో ఉందనీ దీన్ని నిషేధించాలని చాలా మంది కామెంట్లు చేశారు.

ఈ క్రమంలో నాగాలాండ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం కావటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నాగాలాండ్‌కి ఏటా 30,000 కుక్కల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. వాటిని వెట్ మార్కెట్లలో చితకబాది..హింసలు పెట్టి.. ప్రాణం తీస్తున్నారు. ఆ తరవాత వాటిని మేకల్ని కోసినట్టు కోసి వాటి మాంసాన్ని అమ్ముతున్నారు.

అలాగే ఈ సంవత్సరం కరోనా విజృంభిస్తున్న క్రమంలో మిజోరం ప్రభుత్వం కూడా కుక్కల అమ్మకాలపై నిషేధం విధించింది.

Read Here>>ఆన్‌లైన్‌లో గొర్రెలు, మేకల అమ్మకాలు : దటీజ్ కరోనా బిజినెస్ ట్రెండ్