Shashi Tharoor: అందం, తెలివి గురించి యువతి అడిగిన ప్రశ్నకి శశి థరూర్ ఎపిక్ రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో

రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్‌ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shashi Tharoor: అందం, తెలివి గురించి యువతి అడిగిన ప్రశ్నకి శశి థరూర్ ఎపిక్ రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు అనేక సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన ఉంది. అందుకే రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్‌ను విమర్శకులు భావిస్తారు.

Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

తాజాగా ఆయన నాగాలాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది. శశి థరూర్ తెలివైన వాడిగానే కాకుండా, ఆకర్షణీయంగా ఉంటారని రాజకీయవర్గాలు అంటుంటాయి. ఒక టాక్ షోలో పాల్గొన్న థరూర్‌ను ఇదే అంశంపై ఒక యువతి ప్రశ్నించింది. ‘‘ఎవరైనా ఒకేసారి ఇటు అందంగా, ఆకర్షణీయంగా.. అటు తెలివైన వాళ్లుగా ఎలా కనిపించాలో చెప్పండి’’ అని ఒక అమ్మాయి థరూర్‌ను అడిగింది. వెంటనే శశి థరూర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

Bihar: బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు.. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ

‘‘మీరు చాలా స్వీట్.. చాలా మంచి వాళ్లు. అయితే, కొన్ని విషయాల్లో మీరేం చేయలేరు. కానీ, ఇంకొన్ని విషయాల్ని మాత్రం మీరు మార్చగలరు. మనం ఎలా కనిపిస్తున్నాం అనే విషయంలో నిజాయితీగా చెప్పాలంటే.. తల్లిదండ్రుల్ని సరిగ్గా, తెలివిగా ఎంచుకోవాలి. అదంతా మన జీన్స్‌లోనే ఉంది’’ అని థరూర్ రిప్లై ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే, పుస్తక పఠనంపై కూడా శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పుస్తకాలు చదవడం మనకు ఎంతో మేలు చేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటైంది. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటాను. నాకు ఇన్ని విషయలు తెలియడానికి పుస్తకాలు చదవడమే కారణం. నేను చదివింది గుర్తు పెట్టుకుంటా’’ అని వివరించారు.