Nagaland: నాగాలాండ్‌లో ప్రతిపక్షం లేని ప్రభుత్వం.. అన్నిపార్టీలు మద్దతిచ్చాయి..!

నాగాలాండ్‌లో అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు కలిగి ఉన్నప్పటికీ ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి అన్ని పార్టీల మద్దతును ప్రకటించనున్నాయి. అదీ, ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.

Nagaland: నాగాలాండ్‌లో ప్రతిపక్షం లేని ప్రభుత్వం.. అన్నిపార్టీలు మద్దతిచ్చాయి..!

Nagaland

Nagaland: దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. అధికార పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైనప్పుడు ప్రతిపక్షాలు వాటిపాత్ర పోషిస్తాయి. కానీ, ప్రతిపక్షమే లేని ప్రభుత్వాన్ని చాలా అరుదుగా మనం చూస్తుంటాం. నాగాలాండ్‌లో ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం కొనసాగనోంది. నాగాలాండ్‌లో అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు కలిగి ఉన్నప్పటికీ ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి అన్ని పార్టీల మద్దతును ప్రకటించనున్నాయి. అదీ, ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. గత నెల నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటి పలితాలు మార్చి 2న వెలువడ్డాయి. ఎన్డీపీపీ – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న విషయం విధితమే.

Nagaland Poll Results: 60 ఏళ్లలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహిళ.. చరిత్ర సృష్టించిన హేకాని జకాలు

ఎన్నికలముందే జట్టుకట్టిన అధికార ఎన్డీపీపీ 25, బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో రెండు పార్టీలు కలిపి 37మంది ఎమ్మెల్యేలతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే బలం సాధించుకున్నాయి. ఇతర రాజకీయ పార్టీలైన ఎన్‌సీపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీంతో రెండో అతిపెద్దపార్టీగా ఎన్సీపీ అవతరించింది. ఇక, ఎన్‌పీపీ ఐదు, ఎల్‌జేపీ రెండు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్), ఆర్‌పీఐ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అదేవిధంగా జేడీ(యు) ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు సీట్లు గెలుచుకున్నారు. నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని రాజకీయ పార్టీలు విజయం సాధించడం ఇదే తొలిసారి. ఎల్‌జేపీ, ఆర్‌పీఐలు తొలిసారి తమ ఖాతాను తెరిచాయి.

Nagaland Poll Results: మహిళా ముఖ్యమంత్రి సమయం ఆసన్నమైంది.. నాగాలాండ్ మొదటి మహిళా ఎమ్మెల్యే

ఎన్డీపీపీ – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా సంసిద్ధతను వ్యక్తం చేయనప్పటికీ.. ప్రతిపక్షపార్టీలన్ని గంపగుత్తగా మద్దతు పలికేందుకు సిద్ధమయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలు అధికారాన్ని దక్కించుకున్న ఎన్డీపీపీ – బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడంతో రాష్ట్రంలో మరో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడనుంది. గతంలో 2015 నుంచి 2021 కొనసాగిన ప్రభుత్వం లో ప్రతిపక్షాలు‌లేని ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రతిపక్షాలు‌లేని అసెంబ్లీని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇదిలాఉంటే నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ​​శనివారం తన రాజీనామాను గవర్నర్‌లా గణేశన్‌కు సమర్పించిన విషయం విధితమే. ఈశాన్య రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఐదవసారి మార్చి 7న ఆయన ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.