మంచుకురిసే వేళలో : ఎన్నాళ్లకు..ఎన్నాళ్లకు..నాగాలాండ్‌లో హిమపాతం

  • Published By: madhu ,Published On : December 29, 2019 / 10:58 AM IST
మంచుకురిసే వేళలో : ఎన్నాళ్లకు..ఎన్నాళ్లకు..నాగాలాండ్‌లో హిమపాతం

తమ ప్రాంతంలో మంచు ఎప్పుడు కురుస్తుందా ? మంచును బాల్స్‌లాగా తయారు చేసి ఎప్పుడు ఆడుకుందామా అని ఎదురు చూసిన అక్కడి వారిపై ప్రకృతి కరుణించింది. ఎన్నో ఏళ్లుగా కురవని మంచు ప్రస్తుతం భారీగా కురుస్తోంది. దీనితో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కురుస్తున్న మంచులో నడుచుకుంటూ..కేరింతలు కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే నాగాలాండ్. 

ఈశాన్య భారతదేశం ప్రాంతంలోని నాగాలాండ్..జున్ హెబోటో జిల్లాలోని సురుహోటో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీనికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. లువిషి ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోందని, 37 సంవత్సరాల తర్వాత జున్ హెబోటోలో హిమపాతం ఉందన్నారు. ఎంతో అద్బుతమైన బహుమతి ప్రకృతి అందించిందని, క్రిస్మస్ సందర్భంగా నాగాలాండ్‌పై ఆశీర్వాదాలను కురిపించిందని ట్వీట్ చేశారు. 

అఘునాటో సబ్ డివిజన్ పరిధిలో మంచు దుప్పటి పరుచుకుంది. భారీగా కురుస్తుండడంతో అక్కడున్న నివాసాలపై మంచు పేరుకపోయింది. కానీ ఏన్నో ఏళ్లకు మంచు కురుస్తుండడం ఆనందంగా ఉన్నా మరోవైపు కొంతమంది భయపడిపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే సంభవించిందని, రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి వస్తుందనే దానిపై వారు చర్చించుకుంటున్నారు. 

ఇక ఉత్తరాది విషయానికి వస్తే..డిసెంబర్ 31 నుంచి జనవరి 03వ తేదీ వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, చండీఘడ్, నార్త్ రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

https://www.facebook.com/DepartmentOfInformationAndPublicRelations/videos/453794105307152/