Guinness World Record: నాగ్‭పూర్ మెట్రోకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు.. ఇంతకీ ఈ మెట్రో సాధించిన ఘనతేంటో తెలుసా?

వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. కాగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన ధ్రువ పత్రాన్ని నాగ్‭పూర్ మెట్రో భవన్‭లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ అందుకున్నారు. కాగా, తమకు ఈ అవార్డ్ లభించి తమ బాధ్యత మరింత పెంచిందని, వార్దా రోడ్డులో నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాలని, దాన్ని తాము అధిగమించినందుకు ఆనందంగా ఉందని బ్రిజేష్ దీక్షిత్ అన్నారు.

Guinness World Record: నాగ్‭పూర్ మెట్రోకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు.. ఇంతకీ ఈ మెట్రో సాధించిన ఘనతేంటో తెలుసా?

Nagpur Metro has a place in the Guinness World Record

Guinness World Record: మహారాష్ట్రలోని నాగ్‭పూర్ మెట్రోకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రోగా నాగ్‭పూర్ మెట్రో ఈ ఘనత దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవులో రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించలేదు. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది (రోడ్డుపై రోడ్డు వంతెన ఉంటుంది. ఆ వంతెన పైన మెట్రో నిర్మాణం చేపట్టారు). నాగ్‭పూర్ మెట్రో పేరు మీదే గతంలో కూడా ఒక రికార్డు ఉంది. డబుల్ డక్కర్ పద్దతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు నిర్మించి.. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‭లో నాగ్‭పూర్ మెట్రో చోటు సంపాదించుకుంది.

Babri Masjid: అయోధ్యలో బాబ్రీ మసీదును నేలకూల్చి నేటికి 30 ఏళ్లు.. రాబోయే ఎన్నికల లోపే రామాలయం పూర్తి!

వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. కాగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన ధ్రువ పత్రాన్ని నాగ్‭పూర్ మెట్రో భవన్‭లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ అందుకున్నారు. కాగా, తమకు ఈ అవార్డ్ లభించి తమ బాధ్యత మరింత పెంచిందని, వార్దా రోడ్డులో నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాలని, దాన్ని తాము అధిగమించినందుకు ఆనందంగా ఉందని బ్రిజేష్ దీక్షిత్ అన్నారు.

ఇక నాగ్‭పూర్ మెట్రో గిన్నీస్ రికార్డు సాధించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర మెట్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత జాతీయ రహదారుల సంస్థకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. పైన 3.14 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ వయడక్ట్ నిర్మాణం, అలాగే మెట్రో కింద జాతీయ రహదారి నిర్మాణం అద్భుతమని గడ్కరి అన్నారు.

BR Ambedkar Posters: కాషాయ దుస్తుల్లో, నుదిటిపై బొట్లతో అంబేద్కర్ పోస్టర్లు.. ఉద్రిక్తత