Metro Guinness World Record: గిన్నిస్ రికార్డు సాధించిన మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు

మెట్రో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. వార్దా రోడ్డు ప్రాంతంలో ఉన్న 3.14 కిలో మీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది.

Metro Guinness World Record: గిన్నిస్ రికార్డు సాధించిన మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు

Nagpur Metro

Metro Guinness World Record: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. వార్దా రోడ్డు ప్రాంతంలో ఉన్న 3.14 కిలో మీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఈ డబుల్ డెకర్ వయాడక్ట్ ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందింది. దీనిపైభాగంలో మెట్రో రైలు, మధ్యలో హైవే ప్లైఓవర్ ఉన్నాయి. దిగువన ప్రస్తుతమున్న రోడ్డు కొనసాగుతుందని మహా మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు.

Metro Project: మెట్రో ప్రాజెక్ట్‎తో రియల్ ఎస్టేట్‎ జోరు

ఇదిలాఉంటే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పటికే ఆసియా బుక్, ఇండియా బుక్ నుండి అవార్డులను కైవసం చేసుకుంది. హైవే ప్లైఓవర్, మెట్రో రైల్, కిందభాగంలో రహదారి.. ఇలా వార్ధా రోడ్‌లోనే ఉన్నాయి. ఈ విధానం ద్వారా అదనపు భూసేకరణను నివారించవచ్చు. తద్వారా భూమి ఖర్చు ఆదా అవుతుంది. నిర్మాణ సమయం, ప్రాజెక్ట్ వ్యయం తగ్గుతుంది. ప్లైఓవర్ హైవే తొమ్మిది మీటర్ల ఎత్తులో, మెట్రో 20 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ బహుళ లేయర్డ్ కారిడార్‌లో 2.7 కి.మీ రెండవ స్థాయిలో నాలుగు లైన్ల రహదారి ఉండగా, అర కిలో మీటరు ఆరు లైన్ల రహదారిని కలిగి ఉంది.

Underground Metro In Hyderabad : హైదరాబాద్‌లో తొలిసారి అండర్ గ్రౌండ్ మెట్రో

అధికారుల వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ భూసేకరణ, నిర్మాణ ఖర్చులపై ఆదా చేయడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. విమానాశ్రయానికి ప్రయాణ సమయం అంతకుముందు 30 నిమిషాల ఉంటే.. ప్రస్తుతం నాలుగు నిమిషాలు తగ్గించిందని తెలిపారు. ఇదిలాఉంటే.. నాగ్‌పూర్ మెట్రో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినందుకు ఎన్‌హెచ్‌ఏఐ, మహా మెట్రోకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుస ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు.