Self Abortion: యూట్యూబ్ చూసి..ఏడవ నెలలో అబార్షన్ చేసుకున్న యువతి..ఏమైందంటే..

యూట్యూబ్ లో చూసి సొంతంగా అబార్షన్ చేయించుకున్న యువతి ఘటన కలకలం రేపింది.

Self Abortion: యూట్యూబ్ చూసి..ఏడవ నెలలో అబార్షన్ చేసుకున్న యువతి..ఏమైందంటే..

Self Abortion

Self Abortion: యూట్యూబ్ లో చూసి కుట్లు అల్లికలు నేర్చుకుంటే బాగానే ఉంటుంది.మొక్కల్ని పెంచటం నేర్చుకుంటే పచ్చదనం పెరుగుతుంది. కానీ ఏకంగా టూబ్యూబ్ ఆపరేషన్లు చేయటం, సొంత వైద్యం చేసుకుంటే ప్రాణాలకు ప్రమాదమే. అటువంటిది ఏకంగా యూట్యూబ్ లో చూసి ఓ యువతి సొంతంగా అబార్షన్ చేసేసుకుంది. అదికూడా ఏడు నెలల గర్భాన్ని. యూట్యూబ్‎లో అబార్షన్ చేయడం ఎలా అని చూసి తనకు తానే స్వయంగా అబార్షన్ చేసుకుంది. కానీ పాపం ఆ అమ్మాయిది మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కాని పరిస్థితి.

మహారాష్ట్రలోని నాగపూర్‎లో 24 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురయింది. ఫలితంగా గర్భం దాల్చింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కుమిలిపోయింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే పరిస్థితి ఏంటాని ఆలోచించింది. అలా కొంతకాలం గర్భం దాల్చిన విషయాన్ని దాచిపెట్టింది. ఈక్రమంలో కుటుంబ సభ్యులంతా ముంబై వెళ్లారు. ఆమె ఇంటిలో ఒంటరిగా ఉంది. ఇదే తగిన సమయం అనుకుని యూట్యూబ్‌లో అబార్షన్‌ ఎలా చేయాలి అని సెర్చ్ చేసి ఆ వీడియోలో ఉన్నట్లుగానే చేసింది. కానీ అప్పటికే ఆమె ఏడు నెలల గర్భవతి. దీంతో ప్రాణంమీదకు వచ్చింది.

Read more : యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్

అబార్షన్ ఫలితంగా ఆమె కడుపులో అప్పటికే రూపు దిద్దుకున్న శిశువు ఊపిరి ఆగిపోయింది. కడుపులోంచి ఒక మృతశిశువు ఈ లోకాన్ని చూడకుండా కన్నుమూసింది. అబార్షన్ కోసం ఆమె తన ఇంటిలోనే అందుబాటులో ఉన్న పరికరాలను వినియోగించింది. ఫలితంగా ఆమె శరీరానికి ఇన్ఫెక్షన్ సోకింది. ఆ తరువాత అనారోగ్యానికి గురి కావటంతో ఏదైతే జరగకూడదనుకుందో అదే జరిగింది.

ఆమె గురించి అనుమానం వచ్చిన కుటుంసభ్యులు గట్టిగా ప్రశ్నించటంతో అసలు విషయం చెప్పాల్సివచ్చింది. దీంతో జరిగిన ఘోరం ఓ పక్క అమ్మాయి ఆరోగ్యం పాడైందనే బాధ మరోపక్క బాధిస్తుంటే ఆవేదనగా ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా..ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని వేధిచాడని లేకుంటే ఈ విషయం మీ ఇంటిలోవారికి మీ బంధువులకు చెబుతానని బెదిరించినట్లుగా తెలిసింది.

Read more : Same Sex Marri : స్వలింగ సంపర్కుల వివాహాలకు గ్రీన్ సిగ్నల్..కేరింతలు కొడుతున్న జనాలు

కానీ ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. అత్యాచారం అనుకున్న ఈ కేసులో ట్విస్టు బయటపడింది. 2016 నుంచి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని..నమ్మించాడని..అతనిని నమ్మిన తాను పలుమార్లు తనను శారీకరంగా కలిశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. శారీకంగా కలవటంతో గర్భవతిని అయ్యానని తెలిపింది. అతను అబార్షన్ చేయించుకోవాలని తనను ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడు సోహెల్ వాహబ్ ఖాన్‎ను అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read more : interesting King : ఆ రాజుకు 365 మంది భార్యలు..వారి పేర్లతో 365 లాంతర్లు..విశేషాల రాజు వెనుక చరిత్ర