UP CM Yogi : తిరిగి అధికారంలోకి వస్తే..నేరస్థుల భరతం పడుతాం – యూపీ సీఎం హెచ్చరిక

నేరస్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపెట్టిందన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే..నేరస్థుల భరతం పడుతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు...

UP CM Yogi : తిరిగి అధికారంలోకి వస్తే..నేరస్థుల భరతం పడుతాం – యూపీ సీఎం హెచ్చరిక

Up Cm Yogi Adityanath

Nahid Hasan Arrest : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హీట్ ను పెంచుతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో రాజకీయం హాట్ హాట్ గా కొనసాగుతోంది. త్వరలోనే ఇక్కడ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఎస్పీ వైపు వెళ్లారు. దీంతో బీజేపీలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో…యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎస్పీ పార్టీపై పలు విమర్శలు గుప్పించారు.

Read More : Cabinet Key Decision : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఫీజుల నియంత్రణ, విద్యా బోధనకు నూతన చట్టం

నేరస్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపెట్టిందన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే..నేరస్థుల భరతం పడుతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కైరానా నియోజకవర్గంలో నహిద్ హసన్ కు ఎస్పీ పార్టీ టికెట్ కేటాయించింది. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే. నామినేషన్ దాఖలుకు వెళుతుండగా…పోలీసులు అతడిని అరెస్టు చేయడంపై యూపీ సీఎం పై విధంగా స్పందించారు. అయితే..అరెస్టుపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా స్పందించారు. తమ పార్టీకి సంబంధించిన నేతలను, అభ్యర్థులను అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుందని, అందుకే ఈ విధంగా దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

Read More : Covid Cases In Telangana Police : తెలంగాణ పోలీసు శాఖను కలవర పెడుతున్న కోవిడ్ కేసులు

నామినేటెడ్ స్థానంతో కలిపి 404 అసెంబ్లీ స్థానాలున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.
పోలింగ్ దశలు 7.
పోలింగ్ తేదీలు : ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20,
ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 03, మార్చి 07.

Read More : Covid Cases In Telangana Police : తెలంగాణ పోలీసు శాఖను కలవర పెడుతున్న కోవిడ్ కేసులు

2017లో బీజేపీ తిరుగులేని విజయం. బీజేపీకి ఇక్కడ 303 స్థానాలున్నాయి.
ఎస్పీకి 49 స్థానాలు.
బీఎస్పీకి 15 స్థానాలు.
కాంగ్రెస్‌కు 7 స్థానాలు.
ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ.
మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ.