నోయిడా పోలింగ్ బూత్.. ‘నమో ఫుడ్’ ప్యాకెట్లు పంపిణీ

దేశవ్యాప్తంగా లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు జరిగే పోలింగ్ లో తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 06:22 AM IST
నోయిడా పోలింగ్ బూత్.. ‘నమో ఫుడ్’ ప్యాకెట్లు పంపిణీ

దేశవ్యాప్తంగా లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు జరిగే పోలింగ్ లో తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు జరిగే పోలింగ్ లో తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల మోడల్ కోడ్ కండెక్ట్ అమల్లో ఉండగా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో తొలి దశ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో పోలింగ్ బూత్ దగ్గర ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తులు నోయిడా పోలింగ్ బూత్ దగ్గర నమో ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. నమో.. ఈ పదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కామన్ గా అంటారు. అయితే.. నమో ఫుడ్ ప్యాకెట్లపై మోడీ ఫొటోగానీ, బీజేపీ లోగో లేనప్పటికీ.. నమో పేరుతో ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని  పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ.. నమో ఛాయ్, నమో క్యాప్, నమో మర్చండైజ్, నమో టీవీ చూశామని, ఈసారి నమో ఫుడ్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 

నోయిడా సెక్టర్ 15A పోలింగ్ బూత్ బయట నమో ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్టు ఓ నివేదిక తెలిపింది. గౌతమ్ బుద్ద్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి మహేశ్ శర్మ పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకోవడానికి నిమిషం ముందు ఈ నమో ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్టు నివేదికలు వెల్లడించాయి. పోలింగ్ ప్రారంభమైన తర్వాత, పోలింగ్ 48 గంటల ముందు ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదు. ఇది ఎన్నికల మోడల్ కోడ్ కండెక్ట్ కిందకు వస్తుంది. పోలింగ్ బూత్ దగ్గర నమో ఫుడ్ ప్యాకెట్లు పంపిణీపై కేసు నమోదు అయిందో లేదో అనేదానిపై క్లారిటీ లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. పోలింగ్ రోజున జరిగే ప్రాంతాల్లో 200 మీటర్ల దూరంలో పార్టీల నేతలు లేదా పోటీ చేసే అభ్యర్థులు ఉండటం నిషిద్ధం.. 

గౌతమ్ బుద్ద్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత మహేశ్ శర్మతో పాటు సత్వీర్ నగర్ బీఎస్పీ నేత, కాంగ్రెస్ నుంచి అరవింద్ సింగ్ సహా 10మంది ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ లోక్ సభ స్థానానికి ఐదు అసెంబ్లీ సిగ్మంట్లు ఉండగా.. 22లక్షల 97వేల 478 ఓటర్లు ఉన్నారు.