ఈసీ నోటీసులు : మోడీ నమో టీవీకి లైసెన్స్ ఉందా?

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 06:19 AM IST
ఈసీ నోటీసులు : మోడీ నమో టీవీకి లైసెన్స్ ఉందా?

ఇటీవల ప్రారంభమైన టీవీ చానెల్ ‘నమో టీవీ’పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఛానల్ లోగోలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఉండటం.. మోడీ ప్రసంగించే ప్రసంగాలనే ప్రసారం చేస్తుండడంతో దీనిపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఫిర్యాదు చేసిన క్రమంలో అసలు ఇది లైసెన్స్‌డ్ చానలేనా? ఈ చానెల్ ఎవరి పేరు మీద ఉంది అనే విషయాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. ఈ చానెల్ లాంచ్ సమయంలో బీజేపీ తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా ట్వీట్ చేసింది. దాదాపు అన్నీ మేమజర్ డీటీహెచ్‌లలోనూ ఈ నమో టీ.వీ అందుబాటులో ఉంది.

అయితే బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ అఫిషియల్ సైట్‌లోమాత్రం ఈ చానెల్‌కు  సంబంధించిన వివరాలు లేవు. BARC రేటింగ్ కూడా ఈ టీవీ చానెల్‌కు ఇవ్వలట్లేదు. ఎంతమంది చూస్తున్నారనే విషయం చెప్పట్లేదు. దీంతో లైసెన్స్ లేకుంగా నమో చానెల్‌ను నడుపుతున్నారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ దీని వెనుక ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చానెల్‌కు లైసెన్స్ తీసుకోవలసిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడంతో ఓవర్‌నైయట్ సీక్రెట్‌గా దీనికి లైసెన్స్‌లు తెచ్చుకున్నట్లు సీనియర్ మీడియా వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2007, 2012 సమయాల్లో కూడా ఇటవంటి చానెల్స్‌ను మోడీ తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది.  కోడ్ అమలులో ఉన్నప్పుడు ఛానల్‌ను ఎందుకు లాంచ్ చేశారంటూ ప్రశ్నించింది. అలాగే మార్చి 31న ప్రధాని నరేంద్రమోడీ ‘మై బీ చౌకీదార్’ కార్యక్రమాన్ని గంటకుపైగా ప్రసారం చేసినందుకు దూరదర్శన్‌కు కూడా వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు పంపింది.