Nandurbar model : కరోనా కంట్రోల్, సెకండ్ వేవ్ ను ముందే పసిగట్టిన కలెక్టర్..

కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్న క్రమంలో...మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా కలెక్టర్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Nandurbar model : కరోనా కంట్రోల్, సెకండ్ వేవ్ ను ముందే పసిగట్టిన కలెక్టర్..

Corona Second

Covid-19 : కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్న క్రమంలో…మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా కలెక్టర్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా కలెక్టర్ కావడంతో…ముందు చూపుతో ఆయన వ్యవహరించిన తీరు..రాష్ట్రానికే ఆదర్శంగా మారింది. డాక్టర్ రాజేంద్ర భారుడ్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

కోవిడ్ ఫస్ట్ వేవ్ ఉధృతి తగ్గిన క్రమంలో..ఇంకా అంతా అయిపోయిందని కూర్చొకుండా..ప్రపంచ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమై రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనే విధంగా..జిల్లాలో ఉన్న ఆసుపత్రులను సమాయత్తం చేసిన తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. ప్రాణవాయువు కొరత లేకుండా చేసిన తీరు..ఎందరికో ఆదర్శంగా మారింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు రాజేంద్ర భారుడే పంథాను అనుసరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది.

బ్రెజిల్ లాంటి దేశాల్లో తగ్గిపోయిన కరోనా కేసులు మళ్లీ విజృంభించడాన్ని గమనించి…కేసులు ఇక్కడ తగ్గడం తాత్కాలికమేనని డాక్టర్ రాజేంద్ర భారుడ్ భావించారు. జిల్లాలో రోజుకు రెండు వేల ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించేందుకు ల్యాబ్స్ లను ఏర్పాటు చేశారు. 28 మొబైల్ టీంలను నియమించి మారుమూల ఆదివాసి గ్రామాలకు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఏడు వేల ఐసోలేషన్ బెడ్స్, 1300 ట్రీట్ మెంట్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చారు. రూ. 50 లక్షల నిధులతో రెమిడిసివర్ ఇంజక్షన్ లను కొనుగోలు చేసి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పంపిణీ చేశారు.

గత సంవత్సరం కోవిడ్ – 19 ప్రారంభంలో ఆక్సిజన్ ఉత్పత్తులు లేవు. దీంతో సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్రాంట్ ను నిర్మించాలని భావించి..ఆ పనిని పూర్తి చేశారు. రెండు పెద్ద ప్రైవేటు ఆసుపత్రులను ఒప్పించి..వారే స్వయంగా..ఈ ప్లాంట్లను ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేశారు. తాలుకా కేంద్రంలో షహదాలో ఆసుపత్రి లేకపోవడంతో..అక్కడి హాస్టల్ ను హాస్పిటల్ గా మార్చివేశారు. ఇప్పుడు ఇవన్నీ రోజుకు 50 లక్షల ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తున్నాయి.

గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఎక్కువ భాగం, అటవీ ప్రాంతంలో ఉన్న నందుర్బార్ జనాభాలో 70 శాతం ఆదివాసీలే. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో తొలి కరోనా కేసు నమోదైంది. రోగులకు చికిత్స చేయించడానికి ఒక్క ప్రైవేటు ఆసుపత్రి కనికరించలేదు. 200 పడకలున్న జిల్లా ఆసుపత్రి 95 శాతం రో సాధారణ రోగులతో నిండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్, డాక్టర్ రాజేంద్ర భారుడ్ చక్కని ఆలోచన చేశారు. వివిధ కారణాల వల్ల..నిలిచిపోయిన ఆసుపత్రిని కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారు. 200 మంది డాక్టర్లు, నర్సులను ఒప్పంద పత్రంలో భాగంగా నియమించారు. వైరస్ రోగులకు చికిత్స అందించారు. ఆయన్ను ప్రభుత్వం అభినందించింది.