మోడీ నెం.2 : వరల్డ్ లో ఎక్కువమంది ఫాలో అవుతున్న పొలిటీషియన్

  • Published By: venkaiahnaidu ,Published On : May 8, 2019 / 04:28 AM IST
మోడీ నెం.2 : వరల్డ్ లో ఎక్కువమంది ఫాలో అవుతున్న పొలిటీషియన్

ప్రపంచంలో ఎక్కువమంది సోషల్ మీడియా యూజర్లు ఫాలో అవుతున్న రాజకీయనాయకుల్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండవ స్థానంలో నిలిచారు. ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో 110 మిలియన్(11కోట్లు) ఫాలోవర్స్ తో వరల్డ్ లో సెకండ్ మోస్ట్ ఫాలోవ్డ్ పొలిటీషియన్ గా నరేంద్ర మోడీ నిలిచినట్లు ఆన్ లైన్ విజిబులిటీ మేనేజ్ మెంట్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ సాస్ ఫ్లాట్ పాం సెమ్ రష్ మంగళవారం (మే-7,2019) తెలిపింది. ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ లో ప్రపంచవ్యాప్తంగా 182 మిలియన్ల ఫాలోవర్స్ తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నెం.1స్థానంలో నిలిచారు.

 ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 110మిలియన్ల ఫాలోవర్స్ తో నరేంద్రమోడీ… ప్రపంచవ్యాప్తంగా 96 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓవర్ టేక్ చేశారు.అయితే ట్విట్టర్ లో మాత్రం ఎక్కువమంది ఫాలో అవుతున్న రాజకీయనాయకుల్లో ట్రంప్ రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ లలో 12 మిలియన్లు(1.20కోట్లు)మంది ఫాలో అవుతున్నట్లు సెమ్ రష్ తన రిపోర్ట్ లో తెలిపింది.