PM Modi Tour : నేడు వారణాసికి ప్రధాని మోదీ.. రూ.1500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం!

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఈ రోజు (జూలై 15) ల్యాండ్ కానున్నారు. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 744 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తైన అభివృద్ధిపనులను మోదీ ప్రారంభించనున్నారు.

PM Modi Tour : నేడు వారణాసికి ప్రధాని మోదీ.. రూ.1500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం!

Narendra Modi Set For Varanasi

Kashi Vishwanath Temple Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఈ రోజు (జూలై 15) ల్యాండ్ కానున్నారు. యూపీలోని తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ రూ. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. BHU ఆస్పత్రిలోని 100 పడకల విభాగాన్ని ప్రజలకు మోదీ అంకితం చేయనున్నారు. రూ. 744 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తైన అభివృద్ధిపనులను మోదీ ప్రారంభించనున్నారు. అలాగే.. రూ. 839 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ఫౌండేషన్ వేయనున్నారు. ఇందులో సెంటర్ ఫర్ స్కిల్ అండ్ టెక్నికల్ సపోర్ట్, జల్ జీవన్ మిషన్‌లో భాగంగా.. 143 గ్రామీణ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

ప్రధానంగా.. జపాన్ సహకారంతో సిగ్రా దగ్గర నిర్మించిన ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్.. రుద్రాక్ష్‌ను ప్రారంభించనున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించిన.. సుందర్‌లాల్‌ ఆసుపత్రిలో 45 కోట్ల 50 లక్షల ఖర్చుతో.. 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మోడల్‌ ప్రసూతి, చిన్న పిల్లల విభాగాన్ని మోదీ ప్రారంభిస్తారు. వారణాసి-ఘాజీపుర్‌ రహదారిపై మూడు వరుసల పైవంతెనను ప్రారంభిస్తారు.

ఇటు దాదాపు 61 కోట్లతో నిర్మించిన 80 రెసిడెన్షియల్ ప్లాట్లతో పాటు కటారి, చోలాపుర్‌ పాఠశాలల్లో బాలికల కోసం నిర్మించిన హాస్టళ్లను ప్రారంభిస్తారు. ఇక.. యూపీ టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా.. వారణాసిలో ఫెర్రీ సర్వీస్ సహా రాజ్ ఘాట్ నుంచి అస్సీ ఘాట్ దాకా క్రూయిజ్ బోట్లను ప్రారంభించనున్నారు మోదీ. 10 కోట్ల ఖర్చుతో కొత్త క్రూయిజ్ బోటు తీసుకొచ్చారు. కొన్ని ఆస్పత్రులు, హెల్త్ సెంటర్లలో.. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రధాని ఆవిష్కరిస్తారు.