Odisha Train Accident: ప్రమాద బాధితులను పరామర్శించిన మోదీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మోదీ బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Odisha Train Accident: ప్రమాద బాధితులను పరామర్శించిన మోదీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

Narendra Modi

Odisha Train Accident – Narendra Modi: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రమాద ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. వారికి ప్రస్తుతం పలు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మోదీ బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మోదీ వెంట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.

కఠినంగా శిక్షిస్తాం..

అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరైనా ఉంటే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రమాద ఘటన చాలా సీరియస్ విషయమని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. ప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. క్షతగాత్రులను తాను కలిశానని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

Odisha Train Accident: పాకిస్థాన్, రష్యా, జపాన్ సహా పలు దేశాల స్పందన