PM Modi: 2024 ఎన్నికల్లోనూ పీఎం అభ్యర్థిగా నరేంద్ర మోదీనే – అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ సా ఆదివారం కీలక ప్రకటన చేశారు. పట్నా వేదికగా పలు బీజేపీ మోర్చాలతో రెండు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొని నిర్ణయం తీసుకున్నారు. "2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలిసి పోటీ చేస్తాయని నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారని" ప్రకటించారు.

PM Modi: 2024 ఎన్నికల్లోనూ పీఎం అభ్యర్థిగా నరేంద్ర మోదీనే – అమిత్ షా

Pm Modi

 

PM Modi: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ సా ఆదివారం కీలక ప్రకటన చేశారు. పట్నా వేదికగా పలు బీజేపీ మోర్చాలతో రెండు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొని నిర్ణయం తీసుకున్నారు. “2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ – జేడీయూ కలిసి పోటీ చేస్తాయని నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారని” ప్రకటించారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్థి ఎవరనే చర్చ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని కొత్త వ్యక్తులు వస్తారని చర్చ జరుగుతుంది. ఎట్టకేలకు ఈ మిస్టరీని చేధిస్తూ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీనే అని హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

పట్నా వేదికగా జరిగిన బీజేపీ.. యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశ ముగింపు సందర్భంగా బీహార్ లోని జేడీయూతో పొత్తుతో పాటు ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీనే అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీని గురించి బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మాట్లాడారు.

Read Also: జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి: ప్రధాని మోదీ

” బీజేపీ, జేడీయూ కలిసి 2024 లోక్‌సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అందులో సందేహమే లేదు. 2024 ఎన్నికల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగుతాయి. బీహార్ లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం” అని అన్నారు.