Perfume IED: టీచర్ కాదు.. టెర్రరిస్ట్! ప్రభుత్వ ఉపాధ్యాయుడే జమ్ము-కాశ్మీర్ పేలుళ్ల నిందితుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు

గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్‌ను అరెస్టు చేశారు.

Perfume IED: టీచర్ కాదు.. టెర్రరిస్ట్! ప్రభుత్వ ఉపాధ్యాయుడే జమ్ము-కాశ్మీర్ పేలుళ్ల నిందితుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Perfume IED: జమ్ము-కాశ్మీర్‌లో గత నెలలో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అరిఫ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం సంచలనం సృష్టిస్తోంది. లష్కర్-ఇ-తైబా తీవ్రవాద సంస్థతో చేతులు కలిపిన అరిఫ్ ఈ పేలుళ్లకు పాల్పడ్డాడు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. 17 మందిపై అభియోగాలు నమోదు

గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్‌ను అరెస్టు చేశారు. అతడి దగ్గరి నుంచి పర్ఫ్యూమ్ బాంబ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా బాంబ్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. గతంలో ఏ పేలుళ్లలోనూ పర్ఫ్యూమ్ బాంబ్ వాడినట్లు గుర్తించలేదని, ఈ బాంబ్ చూసి ఆశ్చర్యానికి గురైనట్లు ఆయన తెలిపారు.

Women’s T20 World Cup 2023: ఈ నెల 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే

నల్వాల్ పేలుళ్లకు అరిఫ్ ఈ బాంబులనే వాడినట్లు గుర్తించారు. పర్ఫ్యూమ్ బాటిల్‌లా కనిపించే ఈ బాంబును ఎవరైనా ప్రెస్ చేసినా, స్ప్రే వాడేందుకు ప్రయత్నించినా అది పేలిపోతుంది. అరిఫ్ చాలా కాలం నుంచి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అరిఫ్ దాదాపు మూడేళ్ల నుంచి పాకిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. గత ఏడాది మేలో జరిగిన ఒక బస్సు పేలుడు ఘటనలో కూడా అరిఫ్ పాత్ర ఉందని పోలీసులు తేల్చారు.

వైష్ణో దేవి భక్తులతో వెళ్తున్న బస్సుపై జరిపిన బాంబు దాడిలో నలుగురు మరణించగా, 24 మంది గాయపడ్డారు. గత డిసెంబర్‌లో అరిఫ్‌కు తీవ్రవాదుల నుంచి మూడు పర్ఫ్యూమ్ బాంబ్స్ (ఐఈడీలు) అందాయి. వాటిలో రెండింటినీ గత జనవరిలో పేల్చాడు. మిగిలిన బాంబును తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.