Nasal Covid-19 vaccine: ముక్కు ద్వారా కోవిడ్ వాక్సిన్: 2022 జనవరిలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం?

కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ఎక్కవ రక్షణ పొందేవిధంగా మరింత ప్రభావంతగా పనిచేసే ముక్కు ద్వారా తీసుకునే టీకాను అతి త్వరలో భారత్ లో పంపిణీ చేయనున్నారు

Nasal Covid-19 vaccine: ముక్కు ద్వారా కోవిడ్ వాక్సిన్: 2022 జనవరిలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం?

Covid

Nasal Covid-19 vaccine: భారత్ లో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ, దేశ ప్రజలకు ఊరట కలిగించే విషయం ఇది. కరోనా కట్టడికి టీకానే ప్రత్యామ్న్యాయంగా నిలిచిన తరుణంలో, కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ఎక్కవ రక్షణ పొందేవిధంగా మరింత ప్రభావంతగా పనిచేసే ముక్కు ద్వారా తీసుకునే టీకాను అతి త్వరలో భారత్ లో పంపిణీ చేయనున్నారు. ఈమేరకు డిసెంబర్ 26, ఆదివారం నాడు “మన్ కీ బాత్” కార్యక్రమం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకా గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముక్కు ద్వారా తీసుకునే డిఎన్ఏ ఆధారిత కోవిడ్ టీకా మునుషుల్లో కరోనా నివారణకు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని, అన్ని వీలుకుదిరితే జనవరి 2022లోనే ఆ టీకా దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈక్రమంలో భారత్ లో ఏ ఏ సంస్థలు ఇటువంటి టీకాలను తయారు చేస్తున్నాయి, సాంప్రదాయ సూది టీకాల కంటే ముక్కు ద్వారా తీసుకునే టీకాలు ఎందుకు ప్రభావవంతంగా పనిచేస్తాయో తెలుసుకుందాం.

కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు టీకా తప్ప ఇతర మార్గాలు లేవు. అయితే ప్రస్తుతమున్న సాంప్రదాయ సూది టీకాలు కొంతమేర మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయా టీకాలు తీసుకున్న సమీప సమయంలో మళ్లీ కరోనా భారిన పడే అవకాశం లేకపోలేదు. దీంతో శాస్త్రవేత్తలు మరింత ప్రభావవంతమైన టీకాను అభివృద్ధి చేశారు. కోవిడ్ వ్యాప్తి, లక్షణాలు, తీవ్రత వంటి విషయాలపై సమూల అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కోవిడ్ పై ముక్కు ద్వారా తీసుకునే టీకా అయితే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తేల్చారు. ఎందుకంటే, కరోనా వైరస్.. మనిషి ముక్కు, నోటి ద్వారానే శరీరంలోకి చేరుతుందని ఈక్రమంలో అది మనుషుల నాసికా రంద్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు తేల్చారు. అలాంటప్పుడు ముక్కుపుటల ద్వారా టీకాను తీసుకుంటే, అక్కడ కూడా నిరోధకత అభివృద్ధి చెంది కరోనాను సమూలంగా నివారించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంతే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయ సూది టీకా చిన్నారులకు వేయలేని పరిస్థితి తలెత్తింది. కానీ ముక్కు ద్వారా తీసుకునే టీకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని వయసుల వారికీ అందించవచ్చు.

Also Read: Corona cases rise in China: చైనాలో కోవిడ్ హాట్ స్పాట్ గా గ్జియాన్ నగరం: 1.30 కోట్ల మంది లాక్ డౌన్ లోకి

ఇక మన దేశంలో పలు ఫార్మా సంస్థలు ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాను అభివృద్ధి చేసాయి. వాటిలో కొన్ని క్లినికల్ పరీక్షలు ధాటి మార్కెట్లోకి విడుదలకు సిద్ధంగా ఉండగా మరికొన్ని ఇంకా పరీక్షల దశలోనే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా జైడూస్ కాడిల్ల అభివృద్ధి చేసిన డిఎన్ఏ ఆధారిత నాసల్ కోవిడ్ టీకా అతి త్వరలో(Expected in January 2022) మార్కెట్లోకి రానుంది. ZyCoV-Dగా పిలువబడే ఈ కోవిడ్ టీకా 28 రోజుల వ్యవధితో మూడు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ముక్కు ద్వారా తీసుకునే ఈ ZyCoV-D టీకా చిన్నారులకు సైతం అందించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన BBV154 నాసల్ వాక్సిన్ ప్రస్తుతానికి మూడో దశ క్లినికల్ పరీక్షల్లో ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న COVI-VAC టీకా కూడా ప్రయోగ దశలో ఉంది. వీటితో పాటుగా మరికొన్ని విదేశీ ఫార్మా సంస్థలు సైతం ముక్కుద్వారా తీసుకునే కోవిడ్ వాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇక ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తే చిన్నారుల్లో సైతం కరోనా మహమ్మారికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.

Also Read: Modi to Interact with students: విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ