Mars helicopter : మార్స్ పై హెలికాప్టర్, మనుగడ సాగిస్తుందా ?

నాసాకు చెందిన ఇన్ జెన్యూయిటీ మినీ హెలికాప్టర్ మార్స్ పై దిగింది. ఫిబ్రవరి 18వ తేదీన మార్స్ పై ల్యాండ్ అయిన..పర్సీవరెన్స్ రోవర్ కిందిభాగంలో ఈ మినీ హెలికాప్టర్ ను ఫిక్స్ చేశారు.

Mars helicopter : మార్స్ పై హెలికాప్టర్, మనుగడ సాగిస్తుందా ?

Mars

NASA : నాసాకు చెందిన ఇన్ జెన్యూయిటీ మినీ హెలికాప్టర్ మార్స్ పై దిగింది. ఫిబ్రవరి 18వ తేదీన మార్స్ పై ల్యాండ్ అయిన..పర్సీవరెన్స్ రోవర్ కిందిభాగంలో ఈ మినీ హెలికాప్టర్ ను ఫిక్స్ చేశారు. 47 కోట్ల కిలోమీటర్ల మేర నాసా పర్సీవరెన్స్ రోవర్ తో పాటు ప్రయాణం చేసిన ఈ మినీ హెలికాప్టర్ ..రోవర్ ఉదరభాగం నుంచి మార్స్ ఉపరితలంపైన దిగిందని నాసా వెల్లడించింది. అయితే..ఇది మనుగడ సాగిస్తుందా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది. మనుగడ సాగించడమే తర్వాతి లక్ష్యమని నాసాకు చెందిన జెట్ ప్రవల్షన్ లేబొరేటరీ ట్వీట్ చేసింది. తన సొంత బ్యాటరీతో ఇది ఉండాల్సి ఉంటుంది.

మార్స్ రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్స్ పడిపోతాయని, ఇలాంటి వాతావరణంలో మనుగడ సాగిస్తుందా ? లేదా ? అనేది చూడాల్సి ఉంటుందని వెల్లడించింది. వచ్చే రెండు రోజుల పాటు ఇంజెన్యూయిటీ టీమ్ ఈ హెలికాప్టర్ సోలార్ ప్యానెల్స్ ను చెక్ చేయనుంది. తర్వాత బ్యాటరీని రీ ఛార్జ్ చేసి, తొలిసారి ఎగిరే ముందు మోటర్లు, సెన్సార్లను పరిశీలించనుంది. ఈనెల 11వ తేదీన ఈ హెలికాప్టర్ తొలిసారి ఎగిరే ప్రయత్నం చేయనుంది. భూమి సాంద్రతలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న మార్స్ పై ఇది ఎగరడం అంత సులువు కాదంటున్నారు. తొలి ప్రయత్నంలో భాగంగా పది అడుగుల మేర పైకి ఎగిరి, 30 సెకన్ల పాటు అక్కడే ఉండి తిరిగి కిందకు దిగనుంది. మార్స్ పై దిగిన హెలికాప్టర్ ఫొటోను పర్సీవరెన్స్ తీసింది.