Covid-19 Cases: ఇండియాలో ఒక్కరోజులోనే 36శాతం పెరిగిన కేసులు

కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం...

Covid-19 Cases: ఇండియాలో ఒక్కరోజులోనే 36శాతం పెరిగిన కేసులు

Covid Test

Covid-19 Test: కొవిడ్-19 కేసులు వరుసగా నాలుగో రోజు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 2021 చివరి రోజు నమోదైన కేసుల సంఖ్య 22వేలు కాగా అంతకుముందు రోజుతో పోలిస్తే 36శాతం పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మహారాష్ట్రలో 50శాతం, బెంగాల్ లో 62శాతం, అస్సాంలో 90శాతం, జార్ఖండ్ లో 56శాతం, పంజాబ్ లో 32శాతం, తమిళనాడులో 30శాతం, ఉత్తరప్రదేశ్ లో 30శాతం కేసులు పెరిగాయి.

కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం, విరేచనాలతో బాధపడుతుంటారో వారిని కొవిడ్ అనుమానితులుగా పరిగణించాలని చెప్పింది. కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డీజీ డా. బలరాం భార్గవ ఈ మేరకు చీఫ్ సెక్రటరీస్ కు లేఖ రాశారు.

‘పలు ప్రదేశాల్లో 24గంటలు పరీక్షలు జరుపుకునేలా ర్యాపిడ్ కిట్ బూత్ లను ఏర్పాటు చేయాలలి. మెడికల్, పారామెడికల్ స్టాఫ్ తో పాటు హోం టెస్ట్ కిట్లను కూడా అరేంజ్ చేయాలని’ అందులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : న్యూ ఇయర్ రోజు పసిడి ప్రియులకు షాక్

ఎవరైతే వ్యక్తి జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు మంట, శ్వాసఅందకపోవడం, ఒంటి నొప్పులు, రుచి కోల్పోవడం, వాసన తెలియకపోవడం, నీరసం, విరేచనాలు ఉంటే కొవిడ్-19 అనుమానిత కేసు కింద పరిగణించాలని హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. కొవిడ్ నిర్ధారణ కాకున్నా.. ఈ లక్షణాలున్నా హోం ఐసోలేషన్ లో ఉండటం ఉత్తమమని చెప్పింది.

కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 23రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 1200ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: వాట్సాప్ ద్వారా మీ బ్యాంకు బాలన్స్ ఇలా తెలుసుకోండి