National Herald Case: ‘గాంధీ కుటుంబం ఆస్తుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలు’ : మంత్రి స్మృతి ఇరాని

కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ కుటుంబం అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థ ఈడీపై ఒత్తిడి తేవయటానికి కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారంటూ విమర్శించారు. ఈ నిరసనలు కేవలం గాంధీ కుటుంబం ఆస్తులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం అని మంత్రి ఆరోపించారు.

National Herald Case: ‘గాంధీ కుటుంబం ఆస్తుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలు’ : మంత్రి స్మృతి ఇరాని

National Herald Case (1)

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులతో రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈడీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ కుటుంబం అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థ ఈడీపై ఒత్తిడి తేవయటానికి కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారంటూ విమర్శించారు. ఈ నిరసనలు కేవలం గాంధీ కుటుంబం ఆస్తులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం అని మంత్రి ఆరోపించారు. రాహుల్ గాంధీతో సహా చట్టానికి ఎవ్వరు అతీతులు కాదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒకప్పటి వార్తాపత్రిక పబ్లిషింగ్ సంస్థపై గాంధీ కుటుంబానికి అంత ఆసక్తి ఎందుకు అంటూ మంత్రి ప్రశ్నించారు.

Also read : National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసుకు FIR కూడా లేదు..అదొక చిత్తుకాగితం : రేవంత్ రెడ్డి

అవినీతికి మద్దతుగా కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అగ్రనేతలు వచ్చారని ఆరోపించారు.ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? అంటూ ప్రశ్నించారు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని..గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్‌ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. 1930లలో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ 5,000 మంది స్వాతంత్ర్య సమరయోధులతో వాటాదారులుగా ఏర్పడింది. స్వాతంత్య్ర సమరయోధులు నడపాల్సిన సంస్థను నేడు గాంధీ కుటుంబం లాక్కుందని మంత్రి ఆరోపించారు.

Also read :  National Herald Case: ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కేం సంబంధం..

AJL ఉద్దేశ్యం వార్తాపత్రికలను ప్రచురించడం.. అయితే, 2008 లో కంపెనీ ఇకపై వార్తాపత్రికలను ప్రచురించదని ప్రకటించింది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా తెలుసు. రూ. 90 కోట్ల రుణాన్ని మాఫీ చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు డబ్బు విరాళంగా ఇచ్చిన దాతలను మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బును ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సేవ కోసం ఉపయోగించకుండా, గాంధీ కుటుంబానికి లాభం చేకూర్చడానికి ఉపయోగించిందని మీకు తెలుసా?” అంటూ దాతల ప్రశ్నించారు. గాంధీ కుటుంబం తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రజలను ఆహ్వానించిందని మండిపడ్డారు ఇరానీ. ఈ చర్య దాని రాజకీయ స్వభావాన్ని తెలియజేస్తుందన్నారు.

Also read : National Herald case: విచార‌ణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ.. ఈ ప్ర‌శ్న‌లు అడిగిన ఈడీ