నేషనల్ మ్యాథ్స్ డే : ”నాన్నకు ప్రేమతో” సీన్ తో లెక్కల కష్టాలు చెప్పుకున్న నెటిజన్లు

స్టడీస్ లో టఫ్ సబ్జెక్ట్ ఏది అంటే.. ఎక్కువమంది మ్యాథ్స్ అని చెబుతారు. అదేంటో..ఈ లెక్కలు అస్సలు అర్థం కావు అంటారు. ఈ మ్యాథ్స్ కారణంగా బుర్ర వేడెక్కిపోతుంది అని

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 12:19 PM IST
నేషనల్ మ్యాథ్స్ డే : ”నాన్నకు ప్రేమతో” సీన్ తో లెక్కల కష్టాలు చెప్పుకున్న నెటిజన్లు

స్టడీస్ లో టఫ్ సబ్జెక్ట్ ఏది అంటే.. ఎక్కువమంది మ్యాథ్స్ అని చెబుతారు. అదేంటో..ఈ లెక్కలు అస్సలు అర్థం కావు అంటారు. ఈ మ్యాథ్స్ కారణంగా బుర్ర వేడెక్కిపోతుంది అని

స్టడీస్ లో టఫ్ సబ్జెక్ట్ ఏది అంటే.. ఎక్కువమంది మ్యాథ్స్ అని చెబుతారు. అదేంటో..ఈ లెక్కలు అస్సలు అర్థం కావు అంటారు. ఈ మ్యాథ్స్ కారణంగా బుర్ర వేడెక్కిపోతుంది అని చెబుతారు. కొందరికి లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా భయం. స్కూల్ స్థాయిలో మ్యాథ్స్ నుంచి తప్పించుకునే దారి లేదు. టెన్త్ వరకు అది కంపల్సరీ. ఆ తర్వాత తమకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఎంచుకునే అవకాశం దొరుకుతుంది. 

కాగా డిసెంబర్ 22న నేషనల్ మ్యాథ్స్ డే రోజున.. మ్యాథ్స్ బాధితులు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. లెక్కలు అర్థం కాక వారు పడిన బాధను, ఆవేదనను షేర్ చేసుకున్నారు. ఇలా నెటిజన్లు షేర్ చేసిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. #nationalmathematicsday హ్యాష్ ట్యాగ్ తో ఈ ట్వీట్లు చేశారు.

నేను మ్యాథ్స్ తో చాలా స్ట్రగుల్ అయ్యాను అని చెబుతూ ఓ నెటిజన్ తన అనుభవాన్ని, ఆవేదనను తెలుపుతూ ట్వీట్ చేశాడు. ”డియర్ మ్యాథ్స్, నువ్వు చాలామంది జీవితాలతో ఆడుకున్నావు” అని కామెంట్ చేశాడు.

”మ్యాథ్స్ లో నేను నేర్చుకున్నది ఒక్కటే. ఐ హేట్ మ్యాథ్” అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

”నేను లెక్కల కారణంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఈ విషయాన్ని నిజాయితీగా అంగీకరిస్తున్నా. టెన్త్ లో నాకు లెక్కల సబ్జెక్ట్ లో 100కు 17 మార్కులే వచ్చాయి” అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఇక మరో నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ అని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అతడు చేసిన ట్వీట్ ఏంటంటే.. తెలుగులో యంగ్ టైగర్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ”నాన్నకు ప్రేమతో” మూవీ గుర్తుంది కదా. ఈ మూవీ మొత్తం లెక్కల మీదే నడుస్తుంది. హీరో వేసే ప్రతి అడుగులో మ్యాథ్స్ క్యాలకులేషన్స్ ఉంటాయి. ఓ ఫైటింగ్ సీన్ లో రౌడీలను హీరో ఫేస్ చేసే సీన్ ని నెటిజన్ ట్వీట్ చేశాడు. ”సౌత్ లో బిగ్గెస్ట్ మ్యాథమెటీషియన్ ఇతడే..” అంటూ నాన్నకు ప్రేమతో మూవీలోని ఓ క్లిప్ ను షేర్ చేశాడు.

nn

అందులో రౌడీలను ఎదుర్కొనే సమయంలో హీరో కళ్లు మూసుకుంటాడు. మనసులో లెక్కలు వేసుకుంటాడు. రౌడీలు ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్ లో వారిని కొట్టాలి, ఎలా తప్పించుకోవాలి.. ఇలా అన్నీ.. లెక్కలు కొలిచి మరీ హీరో ఫైట్ చేస్తాడు. తన చేతికి మట్టి అంటకుండా రౌడీలను దెబ్బకొడతాడు. ఇప్పుడీ సీన్ నే ఆ నెటిజన్ షేర్ చేశాడు. ”ఎవరండి చెప్పింది.. మ్యాథ్స్ వల్ల కష్టాలు తప్ప లాభాలు లేవని.. ఇదిగో ఈ హీరోని చూడండి.. మ్యాథ్స్ ద్వారా ఎంత సులభంగా రౌడీలను దెబ్బకొట్టాడో తెలుస్తుంది.. దటీజ్ మ్యాథ్స్..” అంటూ ట్వీట్ చేశాడు. ఆ నెటిజన్ సరదాగా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

speed