దేశవ్యాప్తంగా 17, 265 కరోనా కేసులు… 543 మంది మృతి

దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 04:21 AM IST
దేశవ్యాప్తంగా 17, 265 కరోనా కేసులు… 543 మంది మృతి

దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.

దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 543 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17, 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 14, 175 మంది చికిత్స పొందుతున్నారు. 2,546 మది డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్రంలో 4 వేల 203 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 223 మంది మృతి చెందారు. ఢిల్లీలో 2 వేల 3 కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ లో 1407 కేసులు నమోదు కాగా, 72 మృతి చెందారు. గుజరాత్ లో 1743 కేసులు నమోదు కాగా, 63 మంది మృతి చెందారు. తమిళనాడులో 1477 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మంది మృతి చెందారు. రాజస్థాన్ లో 1478 కేసులు నమోదు కాగా, మృతి 14 చెందారు. తెలంగాణలో 858 కేసులు నమోదు కాగా, మృతి 21 చెందారు. ఏపీలో 647 కేసులు నమోదు కాగా, 17 మంది చనిపోయారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం  కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది. రెడ్ జోన్లలో మాత్రం కఠినంగా ఆంక్షలు కొనసాగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ పనులకు అనుమతి లభిస్తుంది. ఐటీ సంస్థలు 50 శాతం ఉద్యోగులతో పని చేసుకోవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం విధించిన మినహాయింపులను అమలు చేయడానికి వెనుకాడుతున్నాయి.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ సమయంలో మినహాయింపులు ఇస్తే కరోనా విజృంభిస్తోందని భయపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎలాంటి మనహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పారు. మే 7వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్ లు కూడా మినహాయింపులకు నో అన్నాయి.

ప్రధాని మోడీ.. ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలపై చర్చించారు. రాష్టరంలో పరిస్థితిపై ఆరా తీశారు. టెస్టింగ్ సామర్థ్యం పెంచినట్లు జగన్.. ప్రధానికి వివరించారు. ఇటు ఏపీ ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరు పై దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.