నేటి నుంచి లాక్ డౌన్ కు పాక్షిక సడలింపు…రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినం

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం  కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది.

10TV Telugu News

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం  కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం  కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది. రెడ్ జోన్లలో మాత్రం కఠినంగా ఆంక్షలు కొనసాగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ పనులకు పనులకు అనుమతి లభిస్తుంది. ఐటీ సంస్థలు 50 శాతం ఉద్యోగులతో పని చేసుకోవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం విధించిన మినహాయింపులను అమలు చేయడానికి వెనుకాడుతున్నాయి.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ సమయంలో మినహాయింపులు ఇస్తే కరోనా విజృంభిస్తోందని భయపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎలాంటి మనహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పారు. మే 7వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.  మే 8 వ తేదీ తర్వాత అన్ని సేవలు పునరుద్రిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.  మే5న క్యాబినెట్ చర్చ పెట్టిమరోసారి సమీక్షించి మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.  

 

ఇక ఏపీలో మాత్రం నేటి నుంచి లాక్ డౌన్ లో మినహాయింపులు రానున్నాయి. రెడ్ జోన్లు మినహా, మిగిలిన చోట్ల పరిమితి సిబ్బందితో కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పరిశ్రమలకు ఓకే చెప్పింది.

 

ప్రధాని మోడీ.. ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలపై చర్చించారు. రాష్టరంలో పరిస్థితిపై ఆరా తీశారు. టెస్టింగ్ సామర్థ్యం పెంచినట్లు జగన్.. ప్రధానికి వివరించారు. ఇటు ఏపీ ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరు పై దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.

 

 

10TV Telugu News