ఉన్నావ్ ఘటనను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

ఉన్నావ్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 03:43 PM IST
ఉన్నావ్ ఘటనను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

ఉన్నావ్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.

ఉన్నావ్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. బాధితురాలికి భద్రత కల్పించకపోవడాన్ని తప్పుబట్టింది. యూపీ డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కోరింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో గురువారం(డిసెంబర్ 5, 2019) ఉదయం న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని అడ్డగించిన దుండగులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 

వివరాళ్లోకి వెళితే.. 2019 మార్చిలో 23 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను చిత్రీకరించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితుల్లో ఒకరిని కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. మరొకరు పరారీలోనే ఉన్నాడు.

అయితే జైలుకెళ్లిన నిందితుడు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసుపై గురువారం కోర్టులో విచారణ ఉండగా.. బాధితురాలు కోర్టుకు బయల్దేరింది. దీంతో బాధితురాలిని నిందితులు అడ్డుకుని ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కిరోసిన్ పోసి నిప్పంటించిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.