Gold Price : 16 రోజుల్లో రూ.1640 పెరిగిన బంగారం.

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జులై 1 నుంచి జులై 17 వరకు 22 క్యారెట్ల బంగారంపై 1500 పెరగ్గా, 24 క్యారెట్ల బంగారంపై రూ.1640 పెరిగింది. జులై 17వ తేదీ 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి రూ.45250 చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం పై రూ.110 పెరిగి రూ.49,370 చేరింది.

Gold Price : 16 రోజుల్లో రూ.1640 పెరిగిన బంగారం.

Gold Price

Gold Price : బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జులై 1 నుంచి జులై 17 వరకు 22 క్యారెట్ల బంగారంపై 1500 పెరగ్గా, 24 క్యారెట్ల బంగారంపై రూ.1640 పెరిగింది. జులై 17వ తేదీ 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి రూ.45250 చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం పై రూ.110 పెరిగి రూ.49,370 చేరింది.

వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండిపై రూ.600 పెరిగి రూ.74,300 చేరింది. ఆరు నెలల్లో వెండిపై రూ.9,300 పెరిగింది. వెండి అమ్మకాలు గతంతో పోల్చుకుంటే పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక కరోనా కేసులు పెరుగుతుండటంతో పెట్టుబడి దారులు బంగారంపైనే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు బంగారం డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. వచ్చే నెలలో పెళ్లి ముహుర్తాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు గత నెలతో పోచితే కొద్దిగా పెరిగాయి. అమ్మకాలు పెరగడానికి ఆషాడం సేల్ ఆఫర్స్ కూడా ఓ కారణమని చెబుతున్నారు నగల వ్యాపారాలు